ఏంటీ ఘోరం : సెల్‌ఫోన్ కోసం చిన్నారిని బలి ఇచ్చారు!

గౌహతి : ఓవైపు సాంకేతికతను వినియోగించుకుంటూనే మరోవైపు మూఢనమ్మకాల మత్తులో జోగుతున్నారు. ఎలాంటి శాస్త్రీయత లేని పాతకాలం మంత్ర-తంత్రాలను పట్టుకుని ఇంకా నరబలులు ఇచ్చే దుస్సాంప్రదాయం దేశంలో అక్కడక్కడా వెలుగుచూస్తుండడం సభ్య సమాజానికి మచ్చ తెచ్చే అంశం.

'పోయిన సెల్ ఫోన్ దొరకడానికి నరబలి ఇవ్వాలని ఓ మంత్రగాడు సూచించడం.. గుడ్డిగా అతని సూచనలను ఫాలో అయిపోయి అభం శుభం తెలియని ఓ నాలుగేళ్ల చిన్నారి తల, చేతులు నరికి బలివ్వడం..' ఎంత సిల్లీగా ఉందిది వినడానికి. సెల్ ఫోన్ కు నరబలికి అసలేమైనా సంబంధం ఉందా! ఎంత తెలివితక్కువ మూర్ఖుడైతే, ఎంత విచక్షణ లేని క్రూరుడైతే ఇలాంటి అఘాయిత్యాలకు తెగబడుతాడు.

4-year-old girl ‘sacrificed’ in Assam to trace lost mobile phone

అసోంలోని రతన్ పూర్ టీ ఎస్టేట్ లో వెలుగుచూసిన సంఘటనను చూసి దేశం మొత్తం ఇప్పుడిదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. పోయిన సెల్ ఫోన్ దొరకడం కోసం సును అనే నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి గత అక్టోబర్ 24న చిన్నారిని మంత్రగాడి సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి బలిచ్చారు. మంగళవారం ఉదయం చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించడంతో విషయం వెలుగుచూసింది.తల, చేతులు నరికి ఉండటంతో నర బలి జరిగినట్లు అనుమానిస్తున్నారు.

స్థానికంగా ఉండే హనుమాన్ భూమిజ్ అనే వ్యక్తి ఇంట్లో పూజలు చేసిన ఆనవాళ్ళు కనిపించడంతో.. తీవ్ర ఆగ్రహావేశాలతో అతనితో పాటు అతని సోదరున్ని చితకబాదారారు గ్రామస్తులు. నరబలితో సంబంధం ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉండడంతో అతనికోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మృతదేహాన్ని గుర్తించిన అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+