40 ఏండ్ల‌ త‌ర్వాత తొలిసారిగా ఓటు వేయ‌నున్న బ‌స్త‌ర్‌లోని 40 గ్రామాలు...

ఓటు అనేది పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ ఎలాంటి ప్రలోభాలకు తలవంచకుండా తమ‌ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. అయితే, భార‌త‌దేశంలోని న‌ల‌భై గ్రామాలు 40 ఏండ్ల త‌ర్వాత తొలిసారిగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నాయి. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బ‌స్త‌ర్ జిల్లా మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతం. ఈ జిల్లాల్లోని అన్నీ గ్రామాలు మావోయిస్టుల అండ‌ర్‌లోనే ఉంటాయి.

ఇప్ప‌డు తొలిసారిగా ఆ గ్రామాల ప్ర‌జ‌లు ఓటు వేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇక్క‌డ ఏకంగా 40 గ్రామాల ప్ర‌జ‌లు న‌లభై ఏళ్ల‌లో ఎన్న‌డూ కూడా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోలేదు. కార‌ణం మావోయిస్టులు.. మావోయిస్టుల భ‌యంతో ఎన్నిక‌ల అధికారులు ఇక్క‌డికి రావ‌డానికే భ‌య‌ప‌డేవారు. ఒక వేళ పోలింగ్ నిర్వ‌హించినా, పోలింగ్ కేంద్రాల‌ను ధ్వంసం చేయ‌డం వంటివి చేసేవారు.

40 villages of Bastar will vote for the first time after 40 years...

నవంబ‌ర్ 7న పోలింగ్‌: మావోయిస్టు ప్రభావిత ప్రాంత‌మైన ఛత్తీస్‌గడ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. నవంబ‌ర్ 7వ తేదీన బస్తర్ జిల్లాలోని 40 గ్రామాల్లోనూ ఓటింగ్ నిర్వహణకు రంగం సిద్ధం అయ్యింది. ఈ 40 గ్రామాల్లో గత 40 ఏళ్లుగా ఎన్న‌డూ పోలింగ్ నిర్వ‌హించ‌లేదు.

మావోయిస్టు సమస్య వల్ల ఇక్కడ పోలింగ్ బూత్‌లు ఎన్నో ఏండ్ల నుంచి మూత‌బ‌డడం, లేదా వేరే గ్రామాలకు తరలించడం జ‌రిగేది. అయితే, ఈ సారి జ‌రిగే అసెంబ్లీ ఎన్నికలు ఈ గ్రామాలకు ప్రత్యేకంగా మారనున్నాయి. ఈ గ్రామాల్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ న‌ల‌భై గ్రామాల‌లో మ‌ళ్లీ 120 పోలింగ్ స్టేష‌న్ల‌ను శ‌నివారం తెర‌వనున్నారు.

40 villages of Bastar will vote for the first time after 40 years...

60కి పైగా సెక్యూరిటి క్యాంపులు: అయితే, ఈ ప్రాంతంలో ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని మావోయిస్టు ఎప్పుడో పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ పిలుపు ఇచ్చిన త‌ర్వాత కూడా ఎన్నికల క‌మిష‌న్ ఎంతో ప‌క‌డ్బందీగా ఇక్క‌డ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతుంది. గ‌త ఐదేళ్ల‌లో మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో సాధార‌ణ ప‌రిస్థితులు తీసుకువ‌చ్చేందుకు 60 కి పైగా సెక్యూరిటి క్యాంపుల‌ను ఏర్పాటు చేశారు అధికారులు.

ఇక్క‌డ పోలీసు బ‌ల‌గాల‌ను మోహిరించి, మావోయిస్టుల అల‌జ‌డి లేకుండా చేశారు. దీంతో ఇక్క‌డ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఇప్ప‌డు ఎలాంటి స‌మ‌స్య‌లేదు. అందుకే, ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల తొలి ద‌శ‌లోనే బ‌స్త‌ర్ డివిజ‌న్‌లోని ఏడు జిల్లాల్లో న‌వంబ‌ర్ 7వ తేదీన పోలింగ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు బ‌స్త‌ర్ ఐజీపీ సుంద‌ర్ రాజ్ తెలిపారు. మావోయిస్టు ప్ర‌భావిత గ్రామాలైన 40 గ్రామాల్లోనూ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+