అసెంబ్లీలో కలకలం..వ్యక్తి ఆత్మహత్యయత్నం?
బెంగళూరు : కర్నాటక అసెంబ్లీలో కలకలం రేగింది. బెంగళూరులోని విధాన సౌధ బిల్డింగ్‌లో 44 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. బిల్డింగ్ మూడో అంతస్తులోని బాత్రూంలో చేతి మణికట్టు, గొంతు కోసి ఉన్న స్థితిలో అతన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే దగ్గరలోని బోరింగ్ అండ్ లేడీ కర్జన్ హాస్పిటల్‌కు తరలించారు. ట్రీట్‌మెంట్ అనంతరం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని చిక్‌బళ్లాపూర్‌కు చెందిన రేవణ్ణకుమార్‌గా గుర్తించారు. అతనితో పాటు కొన్ని పేపర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లైబ్రేరియన్‌గా పనిచేసే ఆయన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.30గంటల మధ్య అతను బిల్డింగ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్లేడ్ లేదా కత్తిలాంటి పదునైన ఆయుధంతో రేవణ్ణ గొంతు కోసుకుని ఉంటాడని బెంగళూరు సెంట్రల్ డీసీపీ దేవ్‌రాజ్ చెప్పారు. అయితే ఆయన విధానసౌధకు ఎందుకు వచ్చారు? ఎవరిని కలవాలనుకున్నారన్న విషయాలు ఇంకా తెలియలేదు. అయితే ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే దిశగానూ దర్యాప్తు జరుపుతున్నామని డీసీపీ ప్రకటించారు.












Click it and Unblock the Notifications