దారుణం... 45 ఏళ్ల వితంతువుపై గ్యాంగ్ రేప్... ఇనుపరాడ్డుతో చిత్రహింసలు...

మధ్యప్రదేశ్‌లో రెండు దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత శనివారం(జనవరి 9) ముగ్గురు యువకులు ఓ మహిళపై గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడి చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మరో ఘటనలో ఓ మైనర్ బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. వివాహితపై గ్యాంగ్ రేప్ గటన సిధి జిల్లాలో చోటు చేసుకోగా... ఖండ్వా జిల్లాలోని జమానియా గ్రామంలో చోటు చేసుకుంది.

మంచినీళ్లు కావాలని అడిగి...

మంచినీళ్లు కావాలని అడిగి...

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 800కి.మీ దూరంలోని సిధి జిల్లాలో ఉన్న అమిలియా పట్టణంలో 45ఏళ్ల ఓ మహిళ టీ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తోంది. శనివారం(జనవరి 9) రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆమె ఇంటి తలుపు తట్టారు. తాగేందుకు మంచినీళ్లు ఇవ్వాలని అడిగారు. దీంతో ఆమె ఇంట్లోకి వెళ్లగా... ఆమె వెనకాలే ఆ ముగ్గురు లోపలికి చొరబడ్డారు.

ఇనుపరాడ్డుతో చిత్రహింసలు

ఇనుపరాడ్డుతో చిత్రహింసలు

ముగ్గురు కలిసి ఆమెపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. అనంతరం ఇనుప రాడ్డుతో ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు రేవా పట్టణంలోని సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ కోలుకోవడానికి వారం రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. నిందితులైన ముగ్గురు వ్యక్తులతో పాటు ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.

13 ఏళ్ల బాలికపై హత్యాచారం

13 ఏళ్ల బాలికపై హత్యాచారం

మరో ఘటనలో ఖండ్వా జిల్లాలోని జమానియా గ్రామంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై 45 ఏళ్ల ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం(జనవరి 11) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక సోమవారం తమ ఇంటి సమీపంలోని ఓ షాపులో బిస్కెట్లు కొనుక్కోవడానికి వెళ్లింది. ఆ సమయంలో షాపు యజమాని ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఎక్కడ ఈ విషయం బయటపెడుతుందేమోనన్న భయంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బదౌని జిల్లాలో 50 ఏళ్ల మహిళపై పూజారి,అతని శిష్యులు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన సంగతి తెలిసిందే. ఇనుప రాడ్డుతో ఆమె జననాంగాలను చిధ్రం చేసి ఆమె హత్యకు కారణమయ్యారు.గతవారం జార్ఖండ్‌లోని కోబ్నా జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వితంతువుపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడి స్టీల్ గ్లాసును ఆమె జననాంగాల్లో దూర్చి చిత్రహింసలకు గురిచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+