ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ : ఐదుగురు మావోల హతం
ఏఓబీ ఎన్ కౌంటర్ లో 30మంది సహచరులను కోల్పోయి తీవ్రంగా దెబ్బ తిన్న మావోయిస్టులకు ఇది మరో ఎదురుదెబ్బలా పరిణమించింది.
రాయ్‌పూర్ : ఏఓబీ (ఆంధ్రా-ఒడిశా సరిహద్దు)లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం ఉదయం ఛత్తీస్‌ఘఢ్ లోని నారాయణపూర్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మొత్తం ఐదుగురు మావోయిస్టులు మరణించారు.

ఏఓబీ ఎన్‌కౌంటర్ లో 30మంది సహచరులను కోల్పోయి తీవ్రంగా దెబ్బ తిన్న మావోయిస్టులకు ఇది మరో ఎదురుదెబ్బలా పరిణమించింది. మృతి చెందిన మావోయిస్టులకు సంబంధించి వివరాలు బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతం తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఆ ప్రాంతన్నంతా జల్లెడ పడుతున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications