ఆయనకు వీధులే ఆస్పత్రులు.. 5రూపాయలకే వైద్యసేవలు.. డాక్టర్ శంకర్ గౌడ మరో ధన్వంతరి!!

వైద్యో నారాయణో హరి అంటారు. దానికి నిజమైన అర్థం చెప్తున వైద్యుడు డాక్టర్ శంకర్ గౌడ ఈ సంవత్సరం ఇండియన్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచారు. వైద్యం వ్యాపారం గా మారిన నేటి రోజుల్లో, వ్యాపార దృక్పథంతో కాకుండా సమాజానికి మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకు నడుస్తున్న ఈ వైద్యుడు ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. కేవలం 5 రూపాయలతో రోడ్డు పక్కన కూర్చుని వైద్యం చేస్తున్న ఈ వైద్యుడు మరో ధన్వంతరిగా అందరి మనస్సులో స్థానం సంపాదించారు.

కర్ణాటక మాండ్యా గ్రామీ ప్రాంతాలలో సుపరిచితుడు 5 రూపాయల వైద్యుడు

కర్ణాటక మాండ్యా గ్రామీ ప్రాంతాలలో సుపరిచితుడు 5 రూపాయల వైద్యుడు


కర్ణాటక లోని షుగర్ జిల్లాగా ప్రసిద్ధి చెందిన మాండ్యాలో 5 రూపాయల వైద్యుడు డాక్టర్ శంకర్ గౌడ గురించి తెలియని వారుండరు. చర్మవ్యాధి నిపుణులు అయిన ఈ డాక్టర్ కేవలం ఐదు రూపాయల ఫీజుతో అతి చౌకగా వైద్యాన్ని అందిస్తూ ఎంతో మందికి దేవుడయ్యా రు. సహజంగా చర్మ వ్యాధులకు సంబంధించిన మందులు ఎక్కువ ధరలు ఉంటాయి. అయినప్పటికీ ఆయన చవకైన మందులనే తన ప్రిస్క్రిప్షన్ లో ఇచ్చి వ్యాధులను తగ్గించడంలో పేరెన్నిక గన్నారు. ఆయన వైద్యం చేశారంటే ఎటువంటి చర్మ సంబంధిత అనారోగ్యమైన ఇట్టే పరారు కావాల్సిందే.

గ్రామాల్లో వీధుల్లో కూర్చునే వైద్యం

గ్రామాల్లో వీధుల్లో కూర్చునే వైద్యం

గ్రామాలలోకి వెళ్లి రోడ్ల పక్కన ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ కూర్చొని తన దగ్గరకు వచ్చిన రోగులకు మందులను ప్రిస్క్రిప్షన్ రాసి ఆయన వైద్యం చేస్తూ ఉంటారు. కర్ణాటక రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత ఉందని గ్రహించి, ఆ సమస్యను తీర్చడం కోసం తాను ప్రజల వద్దకే నేరుగా వెళ్లి పనిచేస్తున్నానని డాక్టర్ శంకర్ గౌడ అనేకసార్లు చెప్పుకొచ్చారు. డాక్టర్ శంకర్ గౌడ్ మణిపాల్ లోని ప్రసిద్ధ కస్తూర్బా మెడికల్ లెడ్జ్ నుండి ఎంబిబిఎస్ డిగ్రీ పొందిన తర్వాత మాస్టర్స్ డిప్లమా పూర్తిచేశారు.

బస్సులో ప్రయాణించి వైద్యం చేసే డాక్టర్.. ఇండియన్ ఆఫ్ ది ఇయర్

బస్సులో ప్రయాణించి వైద్యం చేసే డాక్టర్.. ఇండియన్ ఆఫ్ ది ఇయర్

స్వీట్ షాపుల పక్కన, ఎక్కడైనా అరుగు కనిపించినా అక్కడ హాయిగా కూర్చుని వైద్యం చేసే ఈ వైద్యుడు ప్రజా రవాణా అయినా బస్సు ద్వారా ప్రయాణం చేస్తారు. ఇప్పటివరకు కారు కూడా కొనుగోలు చేయలేకపోయిన వైద్యుడు ఎవరైనా ఉంటే ఆయన డాక్టర్ శంకర్ గౌడ అని చెప్పక తప్పదు. ఎంత మంది రోగులు వచ్చినా సరే అదే ఐదు రూపాయలకు విసుగు లేకుండా, ఎంత టైం అయినా అందరిని చూసి వైద్యం చేసే ఈ వైద్యుడిని దేవుడిగా అందరూ భావిస్తున్నారు. వ్యాపార దృక్పథంతో పనిచేస్తున్న వైద్యులను చూసి వైద్యం అంటేనే అసహ్యించుకునే పరిస్థితి వస్తున్న నేటి రోజుల్లో, ఇటువంటి వైద్యులను చూస్తే ఒకింత ఆశ్చర్యం, చెప్పలేనంత గౌరవం కలుగుతుంది.

గతంలో చెన్నైలోనూ ఓ డాక్టర్ .. ఇప్పుడు కర్ణాటకలో 5 రూపాయల డాక్టర్

గతంలో చెన్నైలోనూ ఓ డాక్టర్ .. ఇప్పుడు కర్ణాటకలో 5 రూపాయల డాక్టర్


గతంలో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో 5 రూపాయలు తీసుకొని వైద్యం చేసే ఒక వైద్యుడు డాక్టర్ తిరువెంగదమ్ వీర రాఘవన్ రెండేళ్ల క్రితం మరణించారు. మొదట ఆయన రెండు రూపాయల ఫీజు తో వైద్యం ప్రారంభించి, ఆ తర్వాత ఐదు రూపాయల వైద్యంతో ఎంతోమంది నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. ఇక ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో డాక్టర్ శంకర్ గౌడ ఐదు రూపాయల వైద్యుడిగా అందరి మన్ననలు పొంది సామాజిక స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+