సమాజం సిగ్గు పడేలా ఐదేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
జైపూర్: సభ్య సమాజం తలదించుకునే సంఘటన రాజస్ధాన్‌లో చోటు చేసుకుంది. కామాంధులకు చిన్న పిల్లల నుంచి వృద్ధురాలు వరకు కనబడితే చాలు మనుషులమన్న సంగతే మరిచి పశువుల్లా ప్రవర్తించిన సంఘటన ఇది. అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు.
రాజస్థాన్ సికార్ రైల్వే స్టేషన్ సమీపంలోని కళ్యాణ్ సర్కిల్ వద్ద ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు వివరించారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం రాత్రి పూట రోడ్డు పక్కన తల్లితో కలసి పడుకున్న ఐదేళ్ల చిన్నారిని దుండగులు ఎత్తికెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఉదయం నిద్రలేచి చూసే సరికే చిన్నారి కనబడని విషయాన్ని గుర్తించిన తల్లి పుట్ పాత్‌పై పడుకున్న వారికి చెప్పడంతో... వారు చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో పడి ఉన్న చిన్నారిని గుర్తించారు. చికిత్స కోసం చిన్నారిని వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.
అక్కడ ప్రాథమికి చికిత్స చేసి, వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం చిన్నారిని జైపూర్ పిల్లల ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరు నిందితులు రామ్ సింగ్, బాబూలాల్ ను అరెస్ట్ చేశారు.
నిందితులపై 376 (రేప్) కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications