దేశంలో 50వేల కొత్త కరోనా కేసులు, భారీగా తగ్గిన మరణాలు: 6 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, అంతకుముందు రోజుతో పోల్చితే గత 24 గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 50వేల లోపే కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా 50వేలకు పైగా నమోదయ్యాయి. అయితే, మరణాల మాత్రం భారీగా తగ్గాయి. కోలుకుంటున్నవారు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది.

దేశంలో కొత్తగా 50,040 కరోనా కేసులు.. 1258 మరణాలు
గడిచిన 24 గంల వ్యవధిలో 17,77,309 మంది నమూనానలు పరీక్షించగా.. 50,040 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,02,33,183కు చేరింది. శనివారం ఒక్కరోజులో 1258 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3,95,751కు చేరింది.

దేశంలో మూడు కోట్లకు చేరువలో రికవరీలు
ఒక్క రోజు వ్యవధిలో కరోనా నుంచి 57,944 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2,92,51,029కు చేరింది. రికవరీ రేటు 96.58 శాతానికిచేరింది. కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.

దేశంలో 6 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
దేశంలోప్రస్తుతం 5,86,403కి తగ్గింది. ప్రస్తుతం దేశంలోపాజిటివిటీ రేటు 1.94 శాతానికి పడిపోయింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 64,25,893 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 32,17,60,077కుచేరింది.

కరోనా కేసులు తగ్గుతుండగా.. డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం
మరోవైపు దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే డెల్టా ప్లస్ వేరియంట్ బారినపడి ఇద్దరు మరణించారు. 8 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో శనివారం డెల్టా ప్లస్ తొలి మరణం సంభవించింది.
డెల్టా పస్ల్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండే అవకాశం ఉందని పలువురు చెబుతుండగా.. ప్రస్తుతానికి ఆ వేరియంట్ వేగం నెమ్మదిగానే ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటకతోపాటు తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కాశ్మీర్, గుజరాత్, హర్యానా ప్రభుత్వాలకు పరీక్షలు పెంచాలని కోరుతూ లేఖలురాసింది.












Click it and Unblock the Notifications