వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 60 మంది ఎవరు ? 10 మంత్రి పదవులు భాగస్వామ్యపక్షాలకు.. మరికొన్నిగంటల్లో మోదీ ప్రమాణం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆయనతోపాటు ఎవరెవరు క్యాబినెట్‌లో కొలువుదీరుతున్నారనే ఉత్కంఠ కొనసాగుతుంది. మోడీతోపాటు 60 మంది వరకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇందులో 8 నుంచి 10 వరకు మంత్రిపదవులు తమ భాగస్వామ్య పక్షాలకు కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

షాకు ఇంటికి నేతల క్యూ ..
ప్రమాణ స్వీకారం నేపథ్యంలో నిన్న 11 అక్బర్ రోడ్‌లోని బీజేపీ చీఫ్ అమిత్ షా ఇళ్లు నేతలతో నిండిపోయింది. తమ పార్టీ నేతలతో పలు విడతలుగా చర్చలు జరిపారు షా. కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, అర్జున్ రామ్ మేఘవాల్ కూడా మంతనాలు జరిపారు. జేడీయూ నేత, బీహర్ సీఎం నితిశ్ కుమార్ కూడా క్యాబినెట్ కేటాయింపులపై అమిత్ షాతో డిస్కస్ చేశారు. అనారోగ్య కారణాల వల్ల తాను మంత్రివర్గంలో చేరానని అరుణ్ జైట్లీ ప్రకటించారు. అయితే క్యాబినెట్‌లో చేరాలని మోదీ కోరారు. నిన్న జైట్లీ ఇంటికెళ్లి మరి .. తమ జట్టులో ఉండాలని విన్నవించారు. అయితే తాను క్యాబినెట్‌లో చేరేదీ లేనీదీ జైట్లీ స్పష్టత ఇవ్వలేదు.

50-60 ministers, 8-10 from allies, likely to take oath with modi

81 మంది వరకు ఛాన్స్
లోక్ సభలో సభ్యుల ఆధారంగా కేంద్రంలో 81 మంది మంత్రులతో క్యాబినెట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మోదీ ప్రధానిగా 50 నుంచి 60 మంది వరకు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. తమ భాగస్వామ్య పక్షాలకు 8 నుంచి 10 పోర్టుఫోలియోలను మోదీ కేటాయించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లో, ఒడిశాలో బీజేపీకి గతంలో కన్నా ఎక్కువ సీట్లు లభించాయి. దీంతో ఈ రాష్ట్రాలకు చెందిన నేతలకు క్యాబినెట్‌లో ఎక్కువ పదవులు వరించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు హర్యానా, జార్ఖండ్‌లో ఈ ఏడాది చివరికల్లా ఎన్నికలు ఉండటంతో .. ఆ రాష్ట్రానికి చెందిన నేతలకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
in few hours modi swearing in delhi. and up to 60 members also modi team. 10 cabinet ministers give to alleys
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X