ఢిల్లీలో కలకలం సృష్టిస్తున్న వరుస హత్యలు! మూడు రోజుల్లో ఐదుగురు, పోలీసులపైనా ఆరోపణలు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వరుసగా హత్యలు జరుగుతున్నాయి. మూడు రోజుల్లోనే ఐదు హత్యలు జరగడం ఢిల్లీలో కలకలం సృష్టిస్తొంది. షాలిమర్‌నగర్‌ బాగ్‌, కృష్ణానగర్‌, న్యూ ఉస్మాన్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన ఈ హత్యోదంతాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

మంగళవారం రాత్రి షాలిమర్‌బాగ్‌లో ప్రియామెహ్రా అనే మహిళ తన భర్త పంకజ్‌ మెహ్రా, రెండేళ్ల కొడుకుతో కలిసి గురుద్వారా నుంచి కారులో వెళుతుండగా.. వారు ప్రయాణిస్తున్న కారును వెంబడించిన కొందరు దుండగులు ఓవర్‌టేక్‌ చేసి కాల్పులు జరిపారు. పంకజ్‌ వ్యాపారి కాగా.. ప్రియ గృహిణి.

5th murder in 3 days, Woman shot Dead in Delhi in front of 2-year-old Son and Husband

ఈ ఘటనలో ప్రియ శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె భర్త పంకజ్‌, కుమారుడు తప్పించుకొని సురక్షితంగా బయటపడ్డారు. ప్రియా మెహ్రాను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా ఆమె మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ విషయంలో ఇటు ఆసుపత్రి వర్గాలు, అటు పోలీసులపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రి వర్గాలు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రియ మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆరోపించారు. ఆసుపత్రికి తీసుకురాగానే ఆమెకు వైద్యం చేసేందుకు యాజమాన్యం నిరాకరించిందని, పోలీసుల నుంచి అనుమతి పత్రం తీసుకురావాలంటూ జాప్యం చేశారని ప్రియు బంధువులు ఆరోపించారు.

మరోవైపు పోలీసులు త్వరగా కేసు నమోదు చేసుకోకపోవడం కూడా ఆమెకు వైద్యసాయం అందడంలో జాప్యం జరగడానికి కారణమైందని, దీంతో సకాలంలో చికిత్స అందకనే ప్రియా మెహ్రా ప్రాణాలు కోల్పోయారనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.

ఆది, సోమవారాల్లో కూడా ఢిల్లీలో ఈ తరహా ఘటనలే వేర్వేరు చోట్ల చోటుచేసుకున్నాయి. ఆదివారం బ్రహ్మపురిలో జరిగిన మరో ఘటనలో వాజిద్‌, ఆరిఫ్‌ఖాన్‌ అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

అలాగే, సోమవారం ఉత్తర ఢిల్లీ ప్రాంతంలో న్యూ ఉస్మాన్‌పూర్‌, కృష్ణానగర్‌లో రోహిత్‌ పాల్‌ (23), జాఫర్‌ (41) అనే వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delhi India’s capital is facing more crimes, Delhi is India’s biggest megacity, It will not be wrong if we quest to claim the title as the country’s capital as a crime capital. The city is looked up as the most unsafe place for people especially women. Delhi for sure holds a very significant position in the political map of India and this is one of the major reasons why Delhi holds the more number of crimes. Crimes in Delhi are no more limited to scattered incidents caused by outsiders; instead, it is more about the city’s deteriorating moral values and loose laws. 2017 is about to end and Delhi holds the highest number of criminal records. Delhi the last three days witnessed five murders in different parts.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి