న్యూక్లియర్ ప్లాంట్ వద్ద పేలుడు: 6గురు మృతి
చెన్నై: తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్కేంద్రం సమీపంలోని సునామీ కాలనీలో గల ఇంటిలో నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మృతుల్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలో నేపథ్యంలో ఓ వర్గానికి చెందినవారు బాంబులను పోగు చేసి దాచి పెట్టినట్లు భావిస్తున్నారు.
బాంబు పేలుళ్ల ప్రభావం మూడు ఇళ్లపై పడింది. అరెస్టు చేస్తారనే భయంతో సునామీ కాలనీలోని వాళ్లంతా పారిపోయారు. ఫైర్, రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. శిథిలాలను తొలగించే పనిని చేపట్టారు. శిథిలాల కింద కొంత మంది చిక్కుకుపోయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

గ్రామస్థులు ఎవరూ లేకపోవడంతో మరణించివారిని పోలీసులు గుర్తించలేకపోతున్నారు. మరిన్ని బాంబులు ఉన్నాయోమోననే అనుమానంతో పోలీసులు సోదాలు చేపట్టారు. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు అసరిపల్లం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
పేలుళ్లు సంభవించిన ప్రాంతానికి కుడంకుళం అణు విద్యుత్తు ప్రాజెక్టుకు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి నాటు బాంబుల పేలుడు సంఘటనతో సంబంధం లేదని పీపుల్స్ మూవ్‌మెంట్ అగైనెస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ నాయకుడు ఎం పుష్పరాయన్ అన్నారు.












Click it and Unblock the Notifications