Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీలో దారుణం.. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం

అనధికార బాణసంచా తయారీ కారణంగా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయాలపాలయ్యారు. దీపావళి సమీపిస్తుండటంతో అనేక మంది అనధికారికంగా బాణసంచా తయారీ లో నిమగ్నం అయ్యారు. అధికారుల నిఘా లోపించటంతో వీరు యధేచ్చగా అక్రమంగా బాణసంచా తయారు చేస్తూ అనేక మంది ప్రాణాలు పోవటానికి కారణమవుతున్నారు. ఉత్తప్రదేశ్ లోని మిరేచీ టౌన్ లోని టకియా ప్రాంతంలో ఇటవంటి దుర్ఘటనే చోటు చేసుకుంది.

నిరేష్ జాతవ్ అనే వ్యక్తికి చెందిన నివాసంలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. అందులో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ ఇల్లు పూర్తిగా డామేజ్ అయింది. కాగా..ఇంటి శిధిలాల కింద మరి కొంత మంది ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలసులు..స్థానిక అధికారులు సహాయ చర్యలకు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

6 people killed many injured in illegal crackers factory blast in uttarpradesh

జిల్లా మెజిస్ట్రేట్ షుకాల్ భారతీతో పాటుగా సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటన పైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇటువంటి అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేస్తున్న వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+