6 ఏళ్ల బాలుడు కిడ్నాప్, రేప్ చేసి చంపేసిన సైకో, గతంలో 60 ఏళ్ల వృద్దురాలిపై రేప్, కోపంగా చూశాడని!
చెన్నై: ఇంటి ముందు సాటి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టుం చేసిన వైద్యులు చిన్నారి మీద లైంగిక దాడి జరిగిందని చెప్పడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. బాలుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సైకోను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గతంలో ఆ సైకో 60 ఏళ్ల వృద్దురాలిపై రేప్ చేసి జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు.

ఇంటి ముందు చిన్నారులతో ఆటలు
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని ఎట్టాయాపురంలో జయశంకర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. జయకుమార్ కుమారుడు నకులన్ (6) సోమవారం ఇంటి ముందు సాటి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్నాడు. తరువాత నకులన్ మాయం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైనారు.

కిడ్నాప్ చేశారని అనుమానం !
బాలుడు నకులన్ కోసం అతని కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం వరకూ గాలించినా ఫలితం లేకపోయింది. తమ కుమారుడు నకులన్ ను ఎవరో కిడ్నాప్ చేశారని జయశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం నకులన్ కోసం అనేక ప్రాంతాల్లో గాలించారు.

ముళ్ల పొదల్లో మృతదేహం
మంగళవారం గ్రామం సమీపంలోని దట్టమైన ముళ్ల పొదల్లో నకులన్ మృతదేహం గుర్తించిన స్థానికులు అతని కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నకులన్ గొంతు మీద బలమైన గాయాలు ఉండటంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టుం కోసం ఆసుపత్రికి తరలించారు.

బాలుడిపై లైంగిక దాడి
నకులన్ మృతదేహాన్ని పోస్టుమార్టుం చేసిన వైద్యులు లైంగిక దాడి చేసి గొంతు మీద బలంగా దాడి చేసి చంపేశారని చెప్పడంతో పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. నకులన్ ను హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నకులన్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తూత్తుకుడి- మధురై జాతీయ రహదారిపై ధర్నా చెయ్యడంతో కిలోమీటర్ల పొడవునా ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి.

6 ఏళ్ల బాలుడు, 60 ఏళ్ల బామ్మపై సైకో అత్యాచారం
నకులన్ ఉంటున్న గ్రామంలోనే నివాసం ఉంటున్న అరుల్ రాజ్ సోమవారం సాయంత్రం బాలుడిని పిలుచుకుని వెలుతున్న విషయం ఇద్దరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అరుల్ రాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో 60 ఏళ్ల వృద్దురాలి మీద అత్యాచారం చేసిన అరుల్ రాజ్ జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు అన్నారు. బాలుడు నకులన్ తనను కోపంగా చూశాడని, అందుకే తీసుకెళ్లి గొంతు మీద కాలు వేసి హత్య చేశానని అరుల్ రాజ్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications