షీలా, దిగ్గీ, గంభీర్, అఖిలేశ్, మేనాకా : వీరే ఆరో విడత బరిలో ప్రముఖులు
న్యూఢిల్లీ : ఆరోవిడత ప్రచారం ముగిసింది. మరో 30 గంటల్లో 59 లోక్ సభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. యూపీలోని 15, హర్యానా 10, బీహర్, మధ్యప్రదేశ్ బెంగాల్ 8, ఢిల్లీ 7, ఝార్ఖండ్ 4 చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది.

హస్తిన బరిలో 164 మంది
ఢిల్లీలోని 7 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగనుండగా .. 164 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, ఆప్ తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఢిల్లీలో షీలా దీక్షిత్, ఒలింపిక్ బాక్సర్ విజేందర్ సింగ్, కేంద్రమంత్రి హర్షవర్ధన్, గౌతం గంభీర్, అతిషి తదితర ప్రముఖుల హస్తిన బరిలో ఉన్నారు.
అఖిలేశ్, మేనకా
ఇక యూపీలో అఖిలేశ్ యాదవ్, కేంద్రమంత్రి మేనకా గాంధీ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు. హరా్యానాలో కేంద్రమంత్రి క్రిష్ణన్ పాల్ గుర్జార్, రావు ఇంద్రజిత్ సింగ్, భూపిందర్ సింగ్ హుడా తదితర ప్రముఖులు తమ అాదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రగ్యా సింగ్ ఠాకూర్ భవితవ్యం తేలనుంది.












Click it and Unblock the Notifications