శివాగ్రహం: అరుణాచలంలో మహా విషాదం..!!

Arunachalam landslide: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీ సహా తమిళనాడు, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర, యానాం, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆశించిన స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదైంది.

అటు తమిళనాడులో చెన్నై సహా ఉత్తర కోస్తా జిల్లాలు- చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట్, తిరుపత్తూర్, కడలూర్‌, దక్షిణ ప్రాంత జిల్లాలైన విల్లుపురం, తంజావూరు, తిరువరూర్, నాగపట్నం, మైలాడుతురై, పుదుక్కోట్టై, రామనాథపురం, కాళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, తూత్తుకూడి, దిండిగల్, మధురై, విరుధ్‌నగర్, థేని, తెన్ కాశి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

7 people died in Arunachalam after huge rock fell on their house

నీలగిరి, ఈరోడ్ కోయంబత్తూర్, తిరుప్పూర్, దిండిగల్, కృష్ణగిరి, సేలం, నామక్కల్, తిరుచ్చి, కరూర్, మధురై, తేని, తూత్తుకూడి వంటి జిల్లాల్లో నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎడతెరిపి లేని వర్షాల వల్ల చెన్నై సిటీ నాలుగు రోజులుగా వరదనీటిలో నానుతోంది.

ఈ భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తిరువణ్ణామలైలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది చిన్నపిల్లలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రాష్ట్ర- జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి.

తిరువణ్ణామలై అన్నామలైయార్ హిల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరుణాచలం ఆలయానికి సమీపంలో ఉంటుందీ కొండ ప్రాంతం. కొండ ప్రాంతాలకు ఆనుకుని పలు నివాసాలు వెలిశాయి. కొద్దిరోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ పెద్ద బండరాయి ఆయా నివాసాలపై పడింది.

ఈ ఘటనలో అయిదుమంది పిల్లలు సహా ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. పలు నివాసాలు బురదమట్టిలో కూరుకుపోయాయి. సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. జేసీబీ, ప్రొక్లెయినర్ల సహకారంతో కొండచరియలను తొలగించే పనిలో నిమగ్నం అయ్యారు.

ఈ ఘటన పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. మృతులకు అయిదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+