నిరవధిక సమ్మెను ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగులు- రాత్రికి రాత్రి..!!

ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్ ను మోగించారు. మార్చి 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈలోగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాల్సి ఉంటుందని అల్టిమేటం జారీ చేశారు.

బెంగళూరు: ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మార్చి రెండో వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు.. ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా- ఇప్పటికే కర్ణాటకలో తొలివిడత ప్రచార కార్యక్రమాలను ముగించుకున్నారు.

ప్రచారంలో మునిగిన వేళ..

ప్రచారంలో మునిగిన వేళ..

అటు కాంగ్రెస్ బస్సు యాత్ర చేపట్టింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య.. ఈ బస్సు యాత్రకు దిశానిర్దేశం చేస్తోన్నారు. జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి జిల్లాల్లో విస్తృతంగా పర్యటనలు చేపట్టారు. పంచరత్నాలను ఆయన ప్రచారం చేస్తోన్నారు.

ఉద్యోగుల సమ్మె సైరన్..

ఉద్యోగుల సమ్మె సైరన్..

ఈ పరిస్థితుల మధ్య- కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్ ను మోగించారు. నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. దీనికి ముహూర్తం కూడా పెట్టేశారు. మార్చి 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు వెల్లడించారు. ఈలోగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాల్సి ఉంటుందని అల్టిమేటం జారీ చేశారు.

ఏడో పే కమిషన్ కోసం..

ఏడో పే కమిషన్ కోసం..

ఏడో పే కమిషన్ కోసం వారు పట్టుబట్టుతున్నారు. దీన్ని అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే మార్చి 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎస్‌ శదక్షరీ తెలిపారు. శివమొగ్గలో విలేకరులతో మాట్లాడారు.

పాత పింఛన్ విధానం..

పాత పింఛన్ విధానం..

ప్రభుత్వ ఉద్యోగులపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చిన్నచూపు చూస్తోన్నారని మండిపడ్డారు. ఆయన వైఖరి తొమ్మిది లక్షల మందికి పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తోందని పేర్కొన్నారు. తమ జీత, భత్యాలను పెంచాలంటూ ఏడో వేతన కమిషన్ చేసిన సిఫారసులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కొత్త పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలంటూ తాము పలుమార్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని చెప్పారు.

టీచర్లు..డాక్టర్లు కూడా..

టీచర్లు..డాక్టర్లు కూడా..

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ లో- ఉద్యోగుల జీత, భత్యాల పెంపు ప్రతిపాదనలు ఏవీ లేవని శదక్షరి చెప్పారు. దీనికి నిరసనగా మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగనున్నామని అన్నారు. తమ సమ్మెకు పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు కూడా మద్దతు ప్రకటించారని, వారంతా విధులకు గైర్హాజరవుతారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+