ఆందోళన కలిగించే విషయం: 8 నెలల పాపపై బంధువు అత్యాచారం కేసుపై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఎనిమిది నెలల పాపపై అత్యాచారం కేసును విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఎనిమిది నెలల పసిగుడ్డుపై బంధువే అత్యాచారం చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న పాపను తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు.
పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అత్యాచారనికి గురైన పాప తల్లి గృహ కార్మికురాలు. తండ్రి అడ్డా కూలీగా పని చేస్తున్నారు. ఆదివారం పాప ఒంటరిగా ఉన్న సమయంలో బంధువే ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఇంటికి వచ్చిన తల్లి... పాప రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి షాకయ్యారు. వెంటనే ఆశుపత్రికి తరలించారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications