యోగి ఆదిత్యనాథ్ హయాంలో 803 అత్యాచారాలు, 729 హత్యలు
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పాలనలో ఉత్తర ప్రదేశ్‌లో గడచిన రెండు నెలల్లో 803 అత్యాచారాలు, 729 హత్యలు జరిగాయని సాక్షాత్తూ ఆ రాష్ట్ర మంత్రి సురేష్ కుమార్ ఖన్నా వెల్లడించారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో గడచిన రెండు నెలల్లో 803 అత్యాచారాలు, 729 హత్యలు జరిగాయని మంత్రి సురేష్ కుమార్ ఖన్నా వెల్లడించారు.
అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు శైలేంద్ర యాదవ్ లలాయి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. మార్చి 15 నుంచి మే 9 వతేదీ వరకు యూపీలో 799 దొంగతనాలు, 60 దోపిడీలు, 2,682 కిడ్నాప్ లు జరిగాయనిన్నారు.

ఈ ఘటనలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అత్యాచార ఘటనల్లో యాభైశాతం కేసులపై చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.
ప్రతి కేసు కూడా నమోదు చేయాలని ఆదేశించడం వల్ల కేసుల సంఖ్య పెరిగిందన్నారు. యూపీలో యోగి పాలనలో నేరాల సంఖ్య పెరిగిందంటూ దానికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు సమాజ్ వాదీ పార్టీకి చెందిన ప్రతిపక్ష నేత రాం గోవింద్ చౌదరితో పాటు ఆ పార్టీ సభ్యులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications