8th Pay Commission: ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు ? 8వ వేతన సంఘం సిఫార్సుల్లో..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం కీలక సిఫార్సులు మోసుకురాబోతోంది. ముఖ్యంగా జీతాల పెంపు విషయంలో 8వ వేతన సంఘం చేయబోతున్న సిఫార్సులు ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో పే కమిషన్ ఏం చెప్పబోతోంది ? ఉద్యోగుల్లో ఉన్న అంచనాలను పే కమిషన్ ఆమోదిస్తుందా ? కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఎలా ఉందో ఓసారి చూద్దాం..
7వ వేతన సంఘం పదవీకాలం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) గత నెలలోనే కేంద్రం నియమించింది. ఈ కమిషన్ సిఫార్సుల కోసం 18 నెలల గడువు ఇచ్చారు. అంటే 2027 మధ్యలో ఈ నివేదిక రావాల్సి ఉంది. ఇందులో 8వ వేతన సంఘం భారీగా వేతనాల పెంపును సిఫార్సు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ పెరిగే వేతనాల్ని సైతం జనవరి 1 నుంచే వర్తింపచేయనున్నారు.

కేంద్రం నియమించిన 8వ వేతన సంఘం ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, భత్యాలు, పెన్షన్లపై అధ్యయనం ప్రారంభించింది. అయితే లెక్క ప్రకారం జనవరి 1, 2026 నుంచి ఈ కమిషన్ అమల్లోకి వస్తుంది. అలాగే రేపు కమిషన్ పెంచే వేతనాలు కూడా ఇదే తేదీ నుంచి బకాయిల రూపంలో వర్తింపజేస్తారని తెలుస్తోంది. ఉద్యోగులకు ఈసారి గరిష్టంగా 35 శాతం వేతనాలు పెంచాలని వేతన సంఘం సిఫార్సు చేయబోతున్నట్లు సమాచారం. వేతనాల స్కేలు, భత్యాలు, ఫిట్ మెంట్ ఆధారంగా ఇవి మారతాయి.

జనవరి 1 న అధికారికంగా 8వ వేతన సంఘం పని ప్రారంభించిన తర్వాత ఏడాది లోపే నివేదిక ఇవ్వడం, కేంద్రం ఆమోదించడం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే కొత్త ఆర్ధిక సంవత్సరంలో ఏదో ఒక సమయంలో వీటిని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు జమ చేసినా జనవరి 1, 2026 నుంచి బకాయిలతో కలిపే జమ చేయబోతున్నారు. దీంతో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.












Click it and Unblock the Notifications