రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి
కర్ణాటక, ఏపీలో రహదారులు రక్తమోడాయి. రెండు ప్రమాదాల్లో 9 మంది చనిపోయారు. ఇండిపెండెన్స్ డే రోజున.. వారి ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్ణాటక బీదర్ జిల్లా బంగూర్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ చిన్నారి సహా ఐదుగురు చనిపోయారు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. మృతులు హైదరాబాద్ బేగంపేటకు చెందినవారిగా గుర్తించారు.
చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. గిరిధర్ (45), అనిత (30), ప్రియ (15), మహేశ్ (2), జగదీశ్ (35) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కలబురిగి జిల్లా గంగాపూర్ దత్తాత్రేయ ఆలయ సందర్శనకు కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. వీరి కారును ఓ కంటైనర్ వెనుకనుంచి ఢీకొంది. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయ్యింది.

ఇటు ఏపీలో ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగివున్న లారీని కారు ఢీకొంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద ప్రమాదం జరిగింది. విద్యార్థులు కారులో విజయవాడ నుంచి చిలకలూరిపేట వైపు వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది.
గౌతమ్ రెడ్డి (విజయవాడ), చైతన్య పవన్ (కాకినాడ), సౌమ్యిక (విశాఖ) అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. వీరంతా ఆర్కిటెక్చర్ విద్యార్థులు అని పోలీసులు తెలిపారు. కారు వేగంగా వస్తుండటంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉందని తెలిసింది. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది.












Click it and Unblock the Notifications