రైల్వే స్టేషన్‌లో భారీగా తొక్కిసలాట- తీవ్ర గాయాలు..!!

Mumbai stampede: ఇంకొద్ది రోజుల్లో దేశ ప్రజలు వైభవంగా దీపావళి పండగను జరుపుకోనున్నారు. తమ స్వస్థలాల్లో కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమౌతున్నారు. స్వస్థలాలకు బయలుదేరి వెళ్లడానికి సమాయాత్తమౌతోన్నారు. ఫలితంగా రైళ్లు, బస్సు ప్రయాణానికి డిమాండ్ ఏర్పడింది.

దీనికి తోడు వరుస సెలవులు రానుండటంతో ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇది తొక్కిసలాటకు దారి తీసింది. ముంబైలోని బాంద్రా టెర్మినస్‌లో ఈ ఉదయం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

9 people were injured in a stampede in Bandra Terminus in Mumbai

తమ సొంతూళ్లకు బయలుదేరి వెళ్లడానికి భారీగా ప్రయాణికులు బాంద్రా టెర్మినస్‌కు చేరుకున్నారు. ఈ తెల్లవారు జాము నుంచే పోటెత్తారు. వందలాదిమంది ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ నంబర్ 1పైకి చేరుకున్నారు. అదే సమయంలో బాంద్రా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్లాల్సిన నంబర్ 22921 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్ ఫామ్ మీదికి రావడంతో తోపులాట చోటు చేసుకుంది.

అది తొక్కిసలాటకు దారి తీసింది. ఈ తెల్లవారు జామున 5:56 నిమిషాలకు ఈ దుర్ఘటన సంభవించింది. ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే భద్రత సిబ్బంది, జనరల్ పోలీసులు వాళ్లను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. గాయపడ్డ వారిలో ఒకరిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గాయపడ్డ వారిని షభీర్ అబ్దుల్ రెహ్మాన్ (40), పరమేశ్వర్ సుఖ్‌దర్ గుప్తా (28), రవీంద్ర హరిహర్ చుమా (30), రామసేవక్ రవీంద్ర ప్రసాద్ ప్రజాపతి (29), సంజయ్ తిలక్ రామ్ కాంగే (27), దివ్యాన్షు యోగేంద్ర యాదవ్ (18), మహ్మద్‌ షరీఫ్ షేక్ (25), ఇంద్రజిత్ సహాని (19), నూర్ మహ్మద్ షేక్ (18)గా గుర్తించారు.

ప్లాట్ ఫామ్ నంబర్ 1పై ప్రయాణికులు పోటెత్తడం, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ అక్కడికి చేరుకోగానే తోపులాట చోటు చేసుకోవడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తొక్కిసలాటలో గాయపడ్డ వారిని రైల్వే పోలీసులు, ఇతర ప్రయాణికులు కాపాడే ప్రయత్నం చేశారు. వారిని తమ భుజాలు, స్ట్రెచర్లపైకి ఎత్తుకుని బయటికి తీసుకెళ్తోండటం ఈ వీడియోల్లో రికార్డయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+