మరో 9 మంది బలి, రెండు కులాల దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు, అర్దరాత్రి !
మణిపూర్: ఇంతకాలం అట్టుడికిన మణిపుర్ లో శాంతిని కాపాడటానికి పోలీసులు, ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు మరోసారి బెడిసికొట్టాయి. మణిపూర్ లో పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆ రాష్ట్రంలోని ప్రజలతో పాటు దేశంలోని ప్రజలు అందరూ అనుకుంటున్న సమయంలో మరోసారి కాల్పులు మోతతో ఆ ప్రాంతాలు స్మశానాలును తలపించాయి.
మణిపూర్ లో తాజాగా హింస చెలరేగడంతో అమాయకులైన 9 మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఖమెన్ లోక్ ప్రాంతంలో మంగళవారం అర్దరాత్రి జరిగిన కాల్పుల్లో ఓ మహిళతో సహ 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాత్రి జరిగిన కాల్పుల్లో చాలా మంది అమాయకులకు బుల్లెట్ గాయాలు కావడంతో వారిని ఇంఫాల్ లోని ఆసుపత్రులకు తరలించారు.

తీవ్రగాయాలైన వారు ఇంఫాల్ లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆర్మీ వర్గాలు బుధవారం చెప్పాయి. మణిపూర్ లో జరిగిన హింసాకాండలో చనిపోయిన వారి శరీరాల్లో బెల్లెట్ గాయాలైన గుర్తులు ఉన్నాయని, పలువురికి వేరే విదాలుగా గాయాలైనాయని ఆర్మీ అధికారులు తెలిపారు. మణిపూర్ లో మరోసారి హింస చెలరేగడంతో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేశామని ఆర్మీ అధికారులు తెలిపారు.
మణిపూర్ లోని మొయిటీ- కుకీ వర్గాల మధ్య కులాల పోరు కారణంగా మణిపూర్ చాలా రోజుల నుంచి అట్టడుకుతోంది. పరిస్థితి అదులోకి వస్తున్న సమయంలో ప్రభుత్వ పెద్దలు మొయిటీ-కుకీల వర్గాల మధ్య రాజీ చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి మణిపూర్ లో హింస చెలరేగడంతో ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద ఆటంకం ఎదురైయ్యింది. .
కాంగ్ పోక్సి- ఇంపాల్ తూర్పు జిల్లాల సరిహద్దులో రెండు రోజుల నుంచి హింస చెలరేగుతోంది. ఇదే సమయంలో మంగళవారం అర్దరాత్రి కాల్పులు మోత మోగడంతో ఓ మహిళతో సహ 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తీవ్రగాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications