అమ్మాయి గురించి స్కూల్ లో అసభ్య మెసేజ్ లు పంపించిన డ్రాయింగ్ టీచర్ !
విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఎస్‌ఎస్‌ఎల్‌సీ విద్యార్థిని మృతి చెందింది. ధర్మస్థలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు రూపేష్ పూజారి అలియాస్ రూపేష్ పై కర్ణాటక పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
నిందితుడు రూపేష్ ప్రైవేట్ స్కూల్‌లో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు అన్నారు. చనిపోయిన విద్యార్థినిని అవమానిస్తూ, ఆ అమ్మాయిని అవహేళన చేస్తూ అసభ్యంగా, చెప్పరాని మాటలతో మరో విద్యార్థినికి టీచర్ రూపేష్ మెసేజ్ లు పంపించాడు. అయితే కొంతకాలం నుంచి టీచర్ రూపేష్ ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి ప్రవర్తన గురించి తప్పుడు సంకేతాలు ఇస్తూ అదే స్కూల్ లో చదివే మరో అమ్మాయికి మెసేజ్ లు పంపిస్తూనే ఉన్నాడు.

చాలాకాలం పాటు ఆత్మహత్య చేసుకున్న ఈ అమ్మాయికి ఈ విషయం తెలియలేదని సమాచారం. అయితే టీచర్ రూపేష్ చేస్తున్న విషయం స్కూల్ లో చాలా మందికి తెలిసిపోయిందని, తరువాత ఆత్మహత్య చేసుకున్న ఆ అమ్మాయికి మ్యాటర్ తెలిసి హడలిపోయిందని తెలిసింది. తన గురించి సాటి విద్యార్థులకు ఎందుకు తప్పుడు మేసేజ్ లు చేస్తున్నావని 10వ తరగతి అమ్మాయి డ్రాయింగ్ టీచర్ రూపేష్ ను ప్రశ్నించింది.
అయితే టీచర్ రూపేష్ ఆ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించాడని తెలిసింది. తన గురించి స్కూల్ లో తప్పుడు సందేశం పంపించారని, చెడుగా ప్రచారం చేస్తున్నారని తెలుసుకున్న ఆ అమ్మాయి ఆవేదన చెందింది. ఇదే విషయంలో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఫిబ్రవరి 7వ తేదీన ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే విద్యార్థినిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

అమ్మాయి ఆరోగ్యం విషమించడంతో అనంతరం బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక సోమవారం రాత్రి విద్యార్థిని మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఫోక్స్ కేసు నమోదు చేసిన పోలీసులు డ్రాయింగ్ టీచర్ రూపేష్ కోసం గాలిస్తున్నారు. అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న వెంటనే డ్రాయింగ్ టీచర్ రూపేష్ పారిపోయాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications