షాక్: జియో ఫీచర్‌ఫోన్‌పై మోర్గాన్ సంచలన నివేదిక
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత్‌లోని టెలికం వ్యాపారులకు షాక్ ఇస్తూ ప్రవేశపెట్టనున్న 4జీ ఫీచర్ ఫోన్ మూడేళ్ళపాటు ఖాతాదారులు తమ నెట్‌వర్క్‌ను ఉపయోగించే ఎత్తుగడను వేసిందనిమోర్గాన్ నివేదిక.
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత్‌లోని టెలికం వ్యాపారులకు షాక్ ఇస్తూ ప్రవేశపెట్టనున్న 4జీ ఫీచర్ ఫోన్ మూడేళ్ళపాటు ఖాతాదారులు తమ నెట్‌వర్క్‌ను ఉపయోగించే ఎత్తుగడను వేసిందని మోర్గాన్ నివేదిక వెల్లడించింది.
న్యూయార్క్‌కు చెందిన బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ సంచలన నివేదిక బయటపెట్టింది. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా జియో లేదని తెలిపింది.

జియో ఫీచర్ ఫోన్‌తో పాటు నెలకు రూ. 153తో రీఛార్జీ చేసుకొని అన్ని సేవలు పొందవచ్చని జియో పేర్కొందని జేపీ మోర్గావ్ గుర్తుచేసింది.
రూ.153 రూపాయాల రీఛార్జీ చేసుకోగల స్థోమత ఉన్నప్పుడు మూడేళ్ళపాటు జియోను అంటిపెట్టుకొని ఉండాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది.
అదే సమయంలో మూడేళ్ళలో కష్టమర్లను అట్టిపెట్టుకొంటామన్ని జియో ప్లాన్ విజయం సాధించడం కష్టమని మోర్గాన్ నివేదిక అభిప్రాయపడింది.
ప్రత్యర్థి కంపెనీలు ఇతర ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకొని బండిల్ ఆఫర్లు వ్రకటించే అవకాశం ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications