బాలికపై అత్యాచారం: దారుణ హత్య
బెంగళూరు: తండ్రి పక్కన నిద్రపోతున్న బాలికను ఎత్తుకు వెళ్లిన దుండగులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన కర్ణాటకలోని బళ్లారి నగరంలో జరిగింది. పోలీసులు హంతకుల కోసం పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
కర్ణాటకలోని గంగావతి తాలుకా, చిల్లయ నగర్ లో సుభాష్, అనిత దంపతులు ఉండేవారు. వీరు సంచార జాతికి చెందిన వారు. పలు ఊర్లలో సంచరిస్తూ జీవనం సాగిస్తున్నారు. సుభాష్, అనితలకు నిర్మల (4) అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం సుభాష్ కుమార్తె, అన్నదమ్ములతో కలిసి బళ్లారిలో ఉంటున్నాడు.
సుభాష్ భార్య కాన్పు కోసం మైసూరులోని పుట్టింటికి వెళ్లింది. ఆదివారం రాత్రి బళ్లారిలోని కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో అందరూ నిద్రపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత కామాంధులు నిర్మలను అక్కడి నుంచి ఎత్తుకు వెళ్లారు. వేకువ జామున సుభాష్ నిద్రలేచాడు.

కుమార్తె కనపడకపోవడంతో స్థానిక గాంధీనగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాలిక కోసం గాలించారు. సోమవారం బళ్లారిలోని అండర్ బ్రిడ్జ్ సమీపంలోని రైలు పట్టాల పక్కన బాలిక శవం పడి ఉన్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హత్యకు గురైయ్యింది నిర్మల అని ఆమె తండ్రి పోలీసులకు చెప్పాడు. బాలిక శరీరం మీద అనేక గాయాలు ఉన్నాయని, అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. బ్రతకడానికి వస్తే తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్నారని సుభాష్ విలపిస్తున్నాడు.












Click it and Unblock the Notifications