Crime News: గోనె సంచిలో ఏముందని చూశాడు.. చూడగానే షాకయ్యాడు..
కిడ్నాప్ అయిన బాలుడు హత్య గురయిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో మంగళవారం ఓ పోలీసు 11 ఏళ్ల కొడుకు కిడ్నాప్ అయిన తర్వాత హత్యకు గురయ్యాడు. భింద్ జిల్లాకు చెందిన వీరేంద్ర శర్మ అనే ఛత్తీస్‌గఢ్ స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌లో పని చేస్తున్నారు. ఇతనికి 11 ఏళ్ల కొడుకు ఆర్యన్ ఉన్నాడు. నగర శివార్లలో ఆర్యన్ మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటికి అతను కనిపించకుండా పోయాడు.
సాయంత్రం అయినా అతని ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్యన్ కోసం గాలింపు చేపట్టారు. అతడి కోసం నగరమంతటా గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్పీ శైలేంద్ర సింగ్ చౌహాన్ స్వయంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇతర ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు. అయినా బాలుడిని గుర్తించలేకపోయారు.

బుధవారం ఒక భవన నిర్మాణ కార్మికుడికి ఓ ప్రదేశంలో గోనె సంచి కనిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా. చిన్నారి కాలు బయటికి పడి ఉండడాన్ని గమనించాడు. భయంతో స్థానికులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గోనె సంచిలో ఉన్న మృతదేహాన్ని ఆర్యన్ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
"ఆర్యన్ శవం అతని ఇంటికి 50 మీటర్ల దూరంలోనే లభ్యమైంది. అతడిని గొంతుకోసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతని కళ్లు, చెవులపై గాయాలు ఉన్నాయి"అని SP చౌహాన్ చెప్పారు. ఆర్యన్ ను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే విషయంపై పోలీసులకు స్పష్టత లేదు. దీనిపై పోలీసులు సీరియస్ దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications