• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లిలో చిచ్చుపెట్టిన పూల‌దండ‌..వధూవరుల కుటుంబాల మధ్య ఘర్షణ; చివ‌ర‌కు ఏమైందంటే

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లాలో సంచలనం కలిగించే ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వివాహ వేడుకలో చోటుచేసుకున్న ఘటన అక్కడ అందరినీ షాక్ కి గురి చేసింది. వివాహం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వధువు పెళ్లికి నిరాకరించింది. పెళ్లికి వధువు నిరాకరించడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అందరూ వధువును ఒప్పించేందుకు ప్రయత్నించగా, ఆమె మనసు మార్చుకోవడానికి నిరాకరించింది. అసలేం జరిగిందంటే

వధువు మెడలో పూలదండ విసిరినట్టు వేసిన వరుడు

వధువు మెడలో పూలదండ విసిరినట్టు వేసిన వరుడు

నివేదికల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లాలోని బిదునా కొత్వాలికి చెందిన నవీన్ బస్తీలో ఘనంగా వివాహ వేడుక జరుగుతోంది. ఈ వివాహ వేడుకలో పూలదండ చిచ్చు పెట్టింది. పూల దండ కారణంగా వివాహ వేడుకే ఆగిపోయింది. సంప్రదాయం ప్రకారం వరుడు వధువు మెడలో దండను వేయడానికి బదులు, వరుడు దండను వధువు పైకి విసిరాడని వధువు వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. వరమాల వేయకుండా విసిరేసిన వరుడి తీరుపై మనస్తాపం చెందిన వధువు అతడితో పెళ్లికి నిరాకరించింది.

వధువు వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో పెళ్లిలో దుమారం

వధువు వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో పెళ్లిలో దుమారం

ఈ ఘటన బిదునా పోలీస్ సర్కిల్ పరిధిలోని నవీన్ బస్తీలో చోటుచేసుకుంది. దీనిపై పెళ్లి కూతురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, పెళ్లి చేసుకోను అని భీష్మించుకు కూర్చుంది. వధువు వరుడిని వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో పెళ్లిలో దుమారం రేగింది. ఆమెను ఒప్పించేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా, ఆమె తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. ఆమె పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో, ఇరు కుటుంబాల వారు తీవ్ర వాగ్వాదానికి దిగారు.

దండ విసరలేదన్న వరుడు...రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. పెళ్లి క్యాన్సిల్

దండ విసరలేదన్న వరుడు...రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. పెళ్లి క్యాన్సిల్

ఇక వరుడు దండను తాను విసర లేదని చెప్పి, వధువు తనపై చేసిన వ్యాఖ్యలను నిరాకరించాడు. పెళ్లి వేడుకలను కొనసాగించమని వధువును ఒప్పించేందుకు కుటుంబీకులు ప్రయత్నించినప్పటికీ ఆమె నిరాకరించింది. వివాదం పెద్దది కదా ఇరువర్గాల వారు కొట్లాటకు దిగారు. వివాహ వేడుకకు వచ్చిన బంధువుల సాక్షిగానే ఈ రచ్చ అంతా జరిగింది. దీంతో చివరకు పోలీసులు ప్రవేశం చేశారు. ఇరువర్గాల వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ వధువు పెళ్ళికి ససేమిరా అనటంతో ఇచ్చిపుచ్చుకున్న కానుకలను తిరిగి ఇవ్వడంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని ఇరు కుటుంబాలు విడిపోయారు. ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

చిన్న చిన్న కారణాలకే చెడిపోతున్న వివాహ సంబంధాలు

చిన్న చిన్న కారణాలకే చెడిపోతున్న వివాహ సంబంధాలు

కారణం ఏదైనా కలిసి నూరేళ్ళు కాపురం చేస్తామా అనుకున్న వధూ వరులు పీటల మీదే విడిపోయారు. చిన్న చిన్న విషయాలకే ఇగోలతో ఇలా పెళ్ళిళ్ళు రద్దు చేసుకుంటున్న వారు ఈ రోజుల్లో బాగా పెరిగిపోయారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్న వారు, తమకు తామే భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందని ఇమేజిన్ చేసుకుంటున్న వారు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫలితంగా దృఢంగా ఉండాల్సిన వైవాహిక బంధాలు, ఆ బంధాలు పడకముందే తెగిపోతున్నాయి.

Recommended Video

  #WATCH Man Marries Both Lover and Bride Chosen by His Family Same Time Viral, Bizarre! || Oneindia
  మొండిగా నిర్ణయాలు తీసుకుంటున్న యువత తీరుపై విస్మయం

  మొండిగా నిర్ణయాలు తీసుకుంటున్న యువత తీరుపై విస్మయం

  ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, అవసరమైన చోట సర్దుకోవాలి అని ఇప్పటి జనరేషన్లో ఎవరూ భావించటం లేదు. ఫలితంగా మొండిగా నిర్ణయాలు తీసుకుని, ఆ మొండి నిర్ణయాలతో నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పూలదండ విసిరినట్లుగా వేసాడు అన్న చిన్న కారణంతో పెళ్లి వద్దని చెప్పిన వధువు తీసుకున్న మొండి నిర్ణయం కారణంగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరగగా, ఆ వివాహ వేడుకను చూడటానికి వచ్చిన వారంతా ఒకింత షాక్ కు గురయ్యారు.

  English summary
  The groom threw the garland at the bride's turban during the vara mala. bride refused to marry him. The shocking incident happened in Uttarpradesh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X