college girl: బాయ్ ఫ్రెండ్ కు ఇంతకు ముందే ?, క్లైమాక్స్ లో పెళ్లికి నో చెప్పిన ప్రియురాలు, పక్కాస్కెచ్ తో !

బెంగళూరు/యలహంక: ఓ యువతి కాలేజ్ లో చదువుకుంటున్నది. ప్రతిరోజు ఆ అమ్మాయి కాలేజీకి వెళ్లి వస్తోంది. యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను ఇద్దరూ ప్రేమించుకున్నారు. నిన్ను పెళ్లి చేసుకుంటానని యువకుడు కాలేజ్ అమ్మాయికి చెప్పాడు. యువతి కూడా అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యింది. ప్రేమికుల పెళ్లి చేసుకోవడానికి ప్రియురాలి కుటుంబ సభ్యులు సరే అన్నారు. కూతురు ప్రేమిస్తున్న యువకుడి గురించి కాలేజ్ అమ్మాయి సీక్రేట్ గా ఆరా తీసింది. ప్రియుడి గురించి ప్రియురాలి తల్లికి షాకింగ్ విషయాలు తెలిశాయి. పెళ్లికి ప్రియురాలి తల్లి అభ్యంతరం చెప్పింది. ఇదే సమయంలో కాలేజ్ అమ్మాయి గొంతు కోసేసి ఆమెను హత్య చెయ్యడం కలకలం రేపింది.

డిగ్రీ కాలేజ్ అమ్మాయి

డిగ్రీ కాలేజ్ అమ్మాయి

బెంగళూరు నగరంలోని యలహంక ప్రభుత్వ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న రాశి (19) అనే యువతి రాజనకుంటే సమీపంలోని దిబ్బూరులోని శానభోగనహళ్లిలో ఆమె తల్లి సుశీలమ్మ, సోదరితో కలిసి నివాసం ఉంటున్నది. ప్రతిరోజు రాశీ షానుబోగనహళ్లి నుంచి యలహంకలోని కాలేజీకి బస్సులో వెళ్లి వస్తోంది. రాశీ తండ్రి నాలుగు నెలల క్రితం చనిపోయాడు. రాశీ తల్లి సుశీలమ్మ ఓ ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తూ కుతుర్లను పోషిస్తోంది.

కాలేజ్ అమ్మాయితో బాయ్ ఫ్రెండ్ గొడవ

కాలేజ్ అమ్మాయితో బాయ్ ఫ్రెండ్ గొడవ

ప్రతిరోజూ కాలేజీ నుంచి ఇంటికి రాశీ కొంతసేపు ఇంటి దగ్గర ఉంటున్నది. తరువాత రాశీ గ్రామం సమీపంలోని వారి పొలంలో మేతకు వదిలేసిన ఆవులను రాశి ఇంటిలి తోలుకుని వస్తున్నది. ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన రాశీ గ్రామం సమీపంలోని పొలానికి వెళ్లింది. ఆ సమయంలో రాశీని కలిసిన ఆమె స్నేహితుడు మధుచంద్ర ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు.

కాలేజ్ అమ్మాయి గొంతు కోసేశాడు

కాలేజ్ అమ్మాయి గొంతు కోసేశాడు

పెళ్లి చేసుకోవడానికి రాశీ నిరాకరించింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన మధుచంద్ర కత్తితో రాశీ గొంతు కోసేసి పారిపోయాడు. అటువైపు వెళ్లిన వాళ్లు రక్తపు మడుగులో పడి ఉన్న రాశిని చూసి ఆమెను వెంటనే యలహంకలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే రక్తస్రావం కారణంగా రాశీ చనిపోయిందని వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

అసలు ఏం జరిగిందంటే ?

అసలు ఏం జరిగిందంటే ?

యలహంకలో నివాసం ఉంటున్న మధుచంద్ర అలియాస్ మధు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాశీకి కొన్ని నెలల క్రితం మధుచంద్ర పరిచయం అయ్యాడు. రానురాను రాశీ, మధుచంద్ర పరిచయం ప్రేమగా మారింది. మధుచంద్రకు ఇంతకు ముందే పెళ్లి అయ్యి ఓ కూతురు ఉంది. తనకు పెళ్లి అయిందన్న విషయాన్ని మధుచంద్ర అతని ప్రియురాలు రాశీ దగ్గర దాచిపెట్టి ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నాడు.

సీక్రేట్ గా ఆరా తీసిన కాలేజ్ అమ్మాయి తల్లి

సీక్రేట్ గా ఆరా తీసిన కాలేజ్ అమ్మాయి తల్లి

మధుచంద్ర, రాశీ విషయం కాలేజ్ అమ్మాయి తల్లి సుశీలమ్మకు తెలిసింది. తండ్రి చనిపోవడంతో ఆమె గ్రాండ్ గా పెళ్లి చేసే స్థోమతలేక కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి సుశీలమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కూతురు రాశీ పెళ్లి చేసుకోబే మధుచంద్ర గురించి తెలుసుకోవాలని సుశీలమ్మ అనుకుంది. సుశీలమ్మ సీక్రేట్ గా కాబోయే అల్లుడు మధుచంద్ర గురించి ఆరా తీసింది. మధుచంద్రకు అప్పటికే పెళ్లయిందని, భార్య, ఓ పాప కూడా ఉందని రాశీ తల్లి సుశీలమ్మకు తేలింది.

కాలేజ్ అమ్మాయికి ఫ్యామిలీ వార్నింగ్

కాలేజ్ అమ్మాయికి ఫ్యామిలీ వార్నింగ్

పెళ్లయిన వ్యక్తి మధుచంద్రతో స్నేహానికి స్వస్తి చెప్పాలని రాశీకి ఆమె తల్లి సుశీలమ్మ, బంధువులు సలహా ఇచ్చారు. అదేవిధంగా మధుచంద్ర పెళ్లి విషయం తెలియగానే రాశీ ఆమె ప్రియుడికి దూరం అయింది. అందంగా ఉన్న ప్రియురాలు రాశీ దూరం కావడంతో మధు చంద్ర రగిలిపోయాడు. రాశీ ఇంటికి వెళ్లి తనను రెండో పెళ్లి చేసుకోవాలని ఆమెను బెదిరించాడు. అయితే రెండో పెళ్లి చేసుకోవడానికి కాలేజ్ అమ్మాయి రాశీ నిరాకరించింది.

ప్రియుడే హంతకుడు !

ప్రియుడే హంతకుడు !

ఈ విషయంపై రగిలిపోయిన మధుచంద్ర మంగళవారం సాయంత్రం రాశీ పొలం దగ్గర ఉన్న విషయం తెలుసుకుని వెళ్లి కత్తితో ఆమెను పొడిచి హత్య చేసి పారిపోయాడని పోలీసులు అంటున్నారు. రెండో పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన బీఏ చదువుతున్న కాలేజ్ అమ్మాయి రాశీ హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. మధుచంద్ర పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. యలహంక సమీపంలోని రాజనుకుంట పోలీస్ స్టేషన్‌లో మధుచంద్ర మీద కేసు నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+