Tata Nexon: కొత్త కారు చూసి షాకైన కస్టమర్.. అన్నీ డ్యామేజీలే..!

కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితుల సహకరించక.. తక్కువ మందే కారు కోంటారు. కొంత మంది సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేస్తే మరి కొందరు కొత్త కారు కొనుగోలు చేస్తారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కారు కొనాలని షో రూం వెళ్లారు. అక్కడ కారు ఆర్డర్ ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత కారు డెలవరీ వచ్చింది. డబ్బులు పే చేశాడు. దీంతో కారు డెలివరీ చేశారు.

అతను కారును పరిశీలించి షాక్ అయ్యాడు. శరత్ కుమార్ అనే రూ. 18.2 లక్షలు పెట్టి టాటా నెక్సాన్ కారును కొన్నాడు. కారును పరిశీలించి షాక్ కు గురయ్యాడు. కారు పై గీతలు, డ్యామేజీలే కనిపించాయి. కారును పూర్తి పరిశీలంచాలని డోర్ ఓపెన్ చేశాడు.అన్నీ సొట్టలు.. గీతలు, హెడ్ లైట్లలో వాటర్.. ఫ్రంట్ బంపర్ల పై గీతలు, క్వార్టర్ ప్యానెల్ ఫ్రేమ్, టెయిల్ గేట్ ఫ్రేమ్ తో పాటు నాసిరకం వెల్డింగ్ , సరిగ్గా అమర్చని డోర్ బీడింగ్ లతో సహా కారు మొత్తం అన్నీ లోపాలతో కనిపించింది.

A customer posted on social media that he was sold a substandard Tata Nexon car

డెలివరీ ముందు చెకింగ్, నాణ్యత నియంత్రణ పరిశీలన లేకపోవడంతో వల్లే ఇలా జరిగిందని అంటున్నారు శరత్ కుమార్ తెలిపారు. దీంతో శరత్ కుమార్ కారును వెంనటే షో రూంకు తీసుకెళ్లాడు. ప్రేరణా మోటార్స్ డీలర్ షిప్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అయితే రీప్లేస్ మెంట్, రీఫండ్ కు ప్రేరణా మోటార్స్ అంగీకరించలేదని శరత తెలిపారు. బదులుగా రీపేర్ చేసిన వాహనాన్ని రెండేళ్ల వారంటీ ఇస్తాం తీసుకెళ్లండి అని సూచించినట్లు పేర్కొన్నాడు.

దీనికి అంగీకరించని శరత్ కుమార్ ఇన్ స్టాగ్రామ్ లో తనకు జరిగిన అన్యాయాన్ని పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది అన్యాయం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు ముందుగా చెక్ చేసుకోవాలి కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీపై టాటా మోటర్స్ ఏమైన స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+