తల్లిని చంపి శవం సూట్ కేసులో పెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కూతురు, ఆంటీతో !
బెంగళూరు: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు కుమారుడు ఉన్నాడు. అయితే కన్న తల్లి, అత్త ఒకే చోట ఉంటున్నారు. భర్త ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో వీరు నివాసం ఉంటున్నారు. కన్న తల్లిని హత్య చేసిన కూతురు ఆమె శవాన్ని ట్రాలీ సూట్ కేసులో పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది
బెంగళూరులోని మైకోలేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సోనాలి ఇంట్లో నిత్యం అత్త ఛాయారాణి, తల్లి బీవా పాల్ మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ కుటుంబ కలహాలతో ఇంట్లో ప్రశాంత లేదని సోనాలి బావించింది. దీంతో విసిగిపోయిన సోనాలి తల పట్టుకుంది. కూతురు బాధ అర్థం చేసుకున్న బీవా పాల్ నన్ను చంపమని ఆమె కూతురు సోనాలికి చెప్పిందని తెలిసింది. సోనాలి కూడా గొడవలు తట్టుకోలేక తల్లిని చంపేయాలని డిసైడ్ అయ్యింది.
అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్‌లో సోమవారం ఉదయం 7 గంటలకు 30 బీపీ మాత్రలు మింగమని తల్లి బీవా పాల్ కు సోనాలి బలవంతం చేసింది. అన్ని మాత్రలు వేసుకున్నా బీవా పాల్ చనిపోలేదు.
తరువాత తానే తన తల్లి బీవా పాల్ మెడకు వేల్ బిగించి హత్య చేసినట్లు సోనాలి పోలీసుల విచారణలో అంగీకరించింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన సోనాలి, సుబ్రత్ సేన్ 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. దంపతులకు 9 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.

కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకున్న సుబ్రత్, సోనాలి దంపతులు కుమారుడితో కలిసి బిలేకల్లి సమీపంలోని ఎంఎస్‌ఆర్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. తండ్రి చనిపోవడంతో సోనాలి ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమె తల్లి బీవా పాల్ ను బెంగళూరులోని ఆమె ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే పెంచిపోషిస్తున్నది. సుబ్రత్ తల్లి ఛాయారాణి కూడా వీరితోనే నివాసం ఉంటున్నారు.
ఇటీవల ఛాయాదేవి, బీవా పాల్ మధ్య సఖ్యత లేదని సమాచారం. చిన్నచిన్న విషయాలకే ఇంట్లో ఇద్దరూ గొడవలు పడేవారని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా సోనాలి తన తల్లిని చంపాలని నిర్ణయించుకుంది. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భర్త సుబ్రత్ ఉద్యోగానికి వెళ్లడంతో తల్లి బీవా పాల్ కు బీపీ మాత్రలు వేసింది.
అప్పుడు సోనాలి ఆమె తల్లి గదిలోకి ఎవరూ రాకుండా జాగ్రత్తపడింది. మాత్రలు వేసుకున్నా చనిపోలేదని సోనాలి తన తల్లి మెడను బిగించి ఊపిరి రాడకుండా చేసి చంపేసింది. అనంతరం ఇంట్లో ఉన్న సూట్‌కేస్‌లో మృతదేహాన్ని నింపి అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వచ్చింది. తల్లి బీవా పాల్ శవాన్ని సూట్ కేసులో పెట్టుకున్న సోనాలి మైకో లేఅవుట్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయిందని పోలీసులు తెలిపారు. సోనాలి ఆతమె తల్లిని హత్య చెయ్యడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications