ప్రభుత్వ ఉద్యోగం, పెళ్లి ఫిక్స్, ఒక్క రోజు ముందు కారులో వెలుతుంటే ఏం జరిగిందంటే ?
పెళ్లికి ముందు కాబోయే దంపతులకు సాంప్రధాయ పద్దతిలో నిర్వహించే నిశ్చితార్థం చేసుకుని సుఖ సంతోషాలతో కుటుంబంతో కలిసి జీవించాలని కలలు కంటున్న ప్రభుత్వ వ్యవసాయ శాఖలో పని చేస్తున్న అధికారి శుభకార్యానికి ఒక్కరోజు ముందు ప్రమాదవశాత్తు మరణించిన దురదృష్టకర సంఘటన కర్ణాటకలోని చిత్రదుర్గా జిల్లాలో చోటుచేసుకుంది.
చిత్రదుర్గా పట్టణంలోని హోళల్‌కెరె రోడ్డులోని తిరుమల డాబా సమీపంలోని ఏకనాథేశ్వరి లేఅవుట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హోళల్‌కెరె అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నవిశాల్ కుమార్ అలియాస్ విశాల్ (28) అనే యువకుడు మృతి చెందాడు. హోళల్‌కెరె అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ (టెక్నికల్)లో పనిచేస్తున్న విశాల్ కుమార్ శనివారం ఉదయం ఉద్యోగానికి హాజరుకావడానికి కారులో బయలుదేరాడు.

చిత్రదుర్గా నుంచి హోల్‌కెరె వెళ్తుండగా హోళల్‌కెరె రోడ్డులోని తిరుమల డాబా సమీపంలో వేగంగా వెలుతున్న లారీ విశాల్ వెలుతున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న విశాల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విశాల్ కుమార్ నిశ్చితార్థం జనవరి 21వ తేదీ ఆదివారం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
చిత్రదుర్గా రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కారు టైర్ పేలి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బెంగుళూరులో నివాసం ఉండే అమ్మమ్మ మృతి చెండంతో ఆమె అంత్యక్రియలు చేసేందుకు స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా దనసూరు గ్రామానికి చెందిన సురేష్ (40), మల్లికార్జున (25), భూమిక (9) అనేముగ్గురు మృతి చెందారు.

నాగమ్మ (31), తాయమ్మ (56), ధనరాజ్ (39), కారు డ్రైవర్ శివ (26) తీవ్రంగా గాయపడి రాంపూర్ ఆసుపత్రిలో చేరారు. సురేష్ అమ్మమ్మ హులిగమ్మ(66) బెంగళూరులో శుక్రవారం మృతి చెందింది. అమ్మమ్మ మృత దేహాన్ని స్వగ్రామానికి కారులో తీసుకుని బయలుదేరారు. మరో కారులో సురేష్ కుటుంబ సబ్యులు వెలుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దావణగెరె ఈస్ట్ జోన్ ఐజీ త్యాగరాజన్, ఎ. ఎస్.పీ తదితర పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications