Unnaoa: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి..
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బుధవారం ఉదయం లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై డబుల్ డెక్కర్ బస్సు బీహార్‌లోని సీతామర్హి నుంచి ఢిల్లీకి వెళుతుండగా, పాల ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు యూపీ సీఎంఓ తెలిపింది.మృతదేహాలను పోస్టు మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

#WATCH | Unnano DM Gaurang Rathi says "Today at around 05.15 AM, a private bus coming from Motihari, Bihar collided with a milk tanker. 18 people have lost their lives and 19 others are injured in the accident. After the initial investigation, it looks like the bus was… https://t.co/H5TantJwnh pic.twitter.com/QYXcLaFqNp
— ANI (@ANI) July 10, 2024
ఉదయం 5.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలం దగ్గర చెల్లాచెదురుగా ఉన్న మృతదేహాలు పడి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బస్సు అతివేగంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే పాల ట్యాంకర్ రోడ్డు మీద ఆగిపోయిందా.. లేదా పాల ట్యాంకర్ నెమ్మదిగా వెళ్తుంటే.. బస్సు అతివేగంతో ఢీకొట్టిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే ఉత్తర ప్రదేశ్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications