అమెరికాకు దగ్గరవుతున్న వేళ.. పాకిస్తాన్ ఫ్యూచరేంటో వెల్లడించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు తన 75వ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటోన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుల గ్రీటింగ్స్ వెల్లువెత్తాయి. బర్త్ డే నాడు మధ్యప్రదేశ్ లో పర్యటిస్తోన్నారు. ధార్‌లో 'స్వాస్త్ నారీ సశక్త్ పరివార్' క్యాంపెయిన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్‌ ను ప్రస్తావించారు. పాకిస్తాన్ భూభాగంపై వెలిసిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌ కు చెందిన స్థావరాలను ధ్వంసం చేయడాన్ని ప్రస్తావించారు. ఈ భారీ విధ్వంసాన్ని ఆ సంస్థ బహిరంగంగా అంగీకరించిందని వెల్లడించారు.

A Fearless New India Ready to Tackle Terror and Nuclear Challenges says PM Modi

ఆధునిక భారత్.. ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోదని, వెనుకంజ వేయబోదనీ అన్నారు మోదీ. ఉగ్రవాదం, దాన్ని ప్రోత్సహించే వారికి గట్టిగా బుద్ధి చెప్పడమే కాకుండా, అణ్వస్త్ర బెదిరింపులకు కూడా భయపడదని ఆపరేషన్ సింధూర్ నిరూపించిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాకిస్థానీ ఉగ్రవాదులు మహిళల నుదుట సింధూరాన్ని తుడిచేశారని, దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని పునరుద్ఘాటించారు.

సాయుధ బలగాలు క్షణాల్లో పాకిస్తాన్ ను మోకరిల్లేలా చేశాయని గుర్తు చేశారు. మరో పాకిస్తాన్ కే చెందిన ఓ ఉగ్రవాది తన ఆవేదనను కన్నీళ్లతో చెబుతున్న దృశ్యాన్ని దేశం, ప్రపంచం చూశాయని మోదీ పేర్కొన్నారు. టాప్ జైష్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీకి చెందిన వైరల్ వీడియోను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉగ్రవాదులను వారి ఇళ్లలోకి వెళ్లి మట్టుపెట్టే కొత్త భారత్ అంటే ఇదేనని వ్యాఖ్యానించారు.

దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలపై జరిగిన సైనిక చర్యలను ఆయన గుర్తు చేశారు. మాతృభూమి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఏ ఒక్క ఉగ్రవాది అయినా భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా ఆపరేషన్ సింధూర్ సాగిందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకూ గట్టి సందేశాన్ని ఇచ్చామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+