Manipur: టార్గెట్ పెట్టారా ?, బీజేపీ ఆఫీస్ మటాష్, నిన్న కేంద్ర మంత్రి, నేడు ?, అంతే !
మణిపూర్: మణిపూర్‌లోని థోంగ్జులో గల బీజేపీ కార్యాలయాన్ని గత రాత్రి ఒక వర్గం వాళ్లు పూర్తిగా ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.మణిపూర్‌లో శాంతిభద్రతలు విఫలమయ్యాయని, ఇంఫాల్‌లోని కొంగ్బా ప్రాంతంలో గురువారం రాత్రి దుండగులు తన నివాసాన్ని తగలబెట్టడంపై కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఇప్పటికే విచారం వ్యక్తం చేశారు.
విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఇక్కడే తన ఇంటిని నిర్మించుకున్నారు. తనను ఓ వర్గం వాళ్లు ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదని, ఎవరైనా మా ఇంటిని నాశనం చేయడానికి, పడగొట్టడానికి ప్రయత్నిస్తారని తాను ఊహించలేదని, ఈ సంఘటనతో తాను షాక్ అయ్యానని కేంద్ర మంత్రి రాజ్ కుమార్ రంజన్ విచారం వ్యక్తం చేశారు.

ఈ రాష్ట్రంలోని నా తోటి పౌరుల నుండి నేను ఇలాంటి ప్రవర్తన, కార్యకలాపాలను ఎదురౌతాయని తాను ఎప్పుడూ ఊహించలేదని, మణిపూర్ చల్లగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని, తన ఇంటి మీద రెండోసారి దాడి జరిగిందని, ఫస్ట్ టైమ్ ఎలాగోలా వాళ్లని ఒప్పించి సెక్యూరిటీ పెంచానని, రాత్రి 10:30 గంటల ప్రాంతంలో మళ్లీ మరోసారి దాడి జరిగిందని, అకస్మాత్తుగా చాలా మంది వ్యక్తులు గుంపులు గుంపుగా వచ్చి దాడి చేయడం వెంటవెంటనే జరిగిపోయిందని కేంద్ర మంతి రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఏఎన్ఐ తో మాట్లాడుతూ విచారం వ్యక్తం చేశారు.
మణిపూర్‌లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడలేకపోయింది, అందుకే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడానికి ఆర్మీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మణిపూర్ కు పంపింది. మణిపూర్ యంత్రాంగం ఎలా విఫలమైందో నాకు తెలియదు, మణిపూర్ లో శాంతి భద్రతలు కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని కేంద్ర మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ అన్నారు.

తన ఇంటిపై దాదాపు 50 మంది దుండగులు దాడి చేశారని కేంద్ర మంత్రి గతంలో ఏఎన్‌ఐకి చెప్పారు. నిన్న రాత్రి ఏం జరిగిందో అని చూస్తే చాలా బాధగా ఉంది. నా ఇంటిపై 50 మందికి పైగా దుండగులు దాడి చేశారు. నా నివాసంలోని గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ దెబ్బతిన్నాయి. ఆ సమయంలో నేనూ, నా కుటుంబ సభ్యులు అక్కడ లేమని. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని కేంద్ర మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి తాను రాష్ట్రం వెలుపల ఉన్నానని చెప్పానని కేంద్ర మంత్రి అన్నారు. మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో మరో 9 మంది మృతి చెందగా, 10 మందికి పైగా గాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 20 వరకు రాష్ట్రంలో ఇంటర్నెట్ షట్‌డౌన్ చేసింది. ఇంఫాల్ వెస్ట్‌లోని మణిపూర్ మంత్రి నెమ్చా కిప్‌జెన్ అధికారిక నివాసాన్ని బుధవారం దుండగులు తగలబెట్టేందుకు ప్రయత్నించారు. మంత్రి ఇల్లు పాక్షికంగా దగ్ధమైంది. మొత్తం మీద మణిపూర్ లో రోజురోజుకు అల్లర్లు ఎక్కువ కావడంతో ఆ రాష్ట్ర ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications