Wife: నాలుగో భార్య నచ్చలేదేమో ? మొబైల్ లో త్రిపుల్ తలాక్ మెసేజ్, మ్యాట్రీమోని ఎఫెక్ట్, కట్ చేస్తే !
ఇండోర్/మధ్యప్రదేశ్: యువతి, యువకుడికి మ్యాట్రిమోని వెబ్ సైట్ ద్వారా పరిచయం అయ్యింది. ఇద్దరి మతాలు ఒకటే కావడంతో ఇద్దరూ టచ్ లో ఉన్నారు. ఒకరి ఫోటోలు ఒకరు చూసుకున్న తరువాత ఫోన నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు. మహిళకు గతంలో వివాహం అయ్యి ఇద్దరు పిల్లలను ఉన్నారు. భర్తకు దూరంగా ఉంటున్న మహిళను పెళ్లి చేసుకుంటానని, మీ పిల్లలను నేను బాగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. వివాహం చేసుకున్న తరువాత భార్య, ఆమె పిల్లలకు అతను సినిమా చూపించాడు. చివరికి భార్యకు తలాక్ తలాక్ తలాక్ అంటూ మూడు సార్లు మెసేజ్ చేసి నీకు త్రిపుల్ తలాక్ ఇచ్చేశాను, నీ చావు నువ్వు చావు అని ఆమె భర్త తేల్చి చెప్పాడు. కేటుగాడు త్రిపుల్ తలాక్ చెప్పింది అతని మొదటి భార్యకు కాదని, నాలుగవ భార్యకు త్రిపుల్ తలాక్ ఇచ్చాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

మ్యాట్రిమోనీలో పరిచయం
మధ్యప్రదేశ్ కు చెందిన మహిళకు, రాజస్థాన్ కు చెందిన ఇమ్రాన్ (32) అనే యువకుడికి కొంతకాలం క్రితం మ్యాట్రిమోని వెబ్ సైట్ ద్వారా పరిచయం అయ్యింది. ఇద్దరి మతాలు ఒకటే కావడంతో ఇద్దరూ టచ్ లో ఉన్నారు. ఒకరి ఫోటోలు ఒకరు చూసుకున్న తరువాత ఫోన నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు. మహిళకు గతంలో వివాహం అయ్యి ఇద్దరు పిల్లలను ఉన్నారు. భర్తకు దూరంగా ఉంటున్న మహిళను పెళ్లి చేసుకుంటానని, మీ పిల్లలను నేను బాగా చూసుకుంటానని ఇమ్రాన్ ఆమెకు హామీ ఇచ్చాడని తెలిసింది.

మోజు తీర్చుకున్నాడు
ఇమ్రాన్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నివాసం ఉంటున్న మహిళను వివాహం చేసుకున్నాడు. ఇంతకాలం భార్యతో ఇమ్రాన్ సంతోషంగానే ఉన్నాడని తెలిసింది. కొత్త భార్యతో ఎంజాయ్ చేస్తున్న ఇమ్రాన్ ఎక్కువగా బయట ఉంటున్నాడని తెలిసింది. ఇమ్రాన్ గురించి అతని భార్య ఆరా తీసింది. మ్యాట్రిమోనీలో పెళ్లి చేసుకున్న మహిళకు ఇమ్రాన్ గురించి షాకింగ్ సమాచారం తెలిసింది.

నేను నాలుగో భార్య
ఇమ్రామన్ ఇంతకు ముందు ముగ్గురు మహిళలను వివాహ: చేసుకున్నాడని తెలుసుకున్న ఇండోర్ భార్య హడలిపోయింది. ఎందుకు నన్ను మోసం చేశావు, నా జీవితంతో ఎందుకు చెలగాటం ఆడావు అంటూ ఇండోర్ లో ఉన్న భార్య ఇమ్రాన్ ను నిలదీసింది. తన గురించి తన నాలుగో భార్యకు తెలిసిపోయింది అనుకున్న ఇమ్రాన్ ఆమె వైపు కన్నెత్తికూడా చూడకుండా రాజస్థాన్ లోనే ఉండిపోయాడని తెలిసింది.

త్రిపుల్ తలాక్ అంటూ మెసేజ్ పంపించిన ఇమ్రాన్
నాలుగో భార్య పోరు ఎక్కువ కావడంతో ఇమ్రాన్ రగిలిపోయాడు. ఇదే సమయంలో ఇమ్రాన్ ఇండోర్ లో ఉన్న నాలుగో భార్య మొబైల్ ఫోన్ కు తలాక్ తలాక్ తలాక్ అంటూ త్రిపుల్ తలాక్ అని మెసేజ్ పంపించాడు, నీకు నేను విడాకులు ఇచ్చేశానని, నీ జీవితం నువ్వు గడపాలని ఇమ్రాన్ తేల్చి చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం త్రిపుల్ తలాక్ ను నిషేధించిన విషయం తెలిసిందే, ఎవరైన త్రిపుల్ తలాక్ అని భార్యకు విడాకులు ఇస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇండోర్ లో ఉన్న నాలుగో భార్య రాజస్థాన్ కు చెందిన ఇమ్రాన్ మీద కేసు పెట్టిందని, కేసు విచారణ చేస్తున్నామని, ఇంత వరకు ఇమ్రాన్ ను అరెస్టు చెయ్యలేదని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి మనీష్ డాంగి ఇండోర్ లో మీడియాకు చెప్పారు.

నాలుగో పెళ్లి విషయంలో గొడవలు
ఇమ్రాన్ కు ఇంతకు ముందే ముగ్గురు భార్యలు ఉన్నారని తెలిసిన తరువాత ఇండోర్ లో ఉన్న నాలుగో భార్యతో గొడవలు జరిగాయని పోలీసు అధికారి మనీష్ డాంగి అంటున్నారు, తన త్రిపుల్ తలాక్ రద్దు చేసి ఇమ్రాన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అతని నాలుగో భార్య కేసు పెట్టిందని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి మనీష్ డాంగి మీడియాకు చెప్పారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications