అక్రమ సంబంధం, లవ్ మ్యారేజ్ చేసుకుని భార్యను ఏం చేశాడంటే ?, ఆంటీ, అంకుల్ !
చెన్నై/కోయంబత్తూర్: ఓ యువతి చక్కగా కాలేజ్ కు వెళ్లి చదువుకుంటున్నది. కాలేజ్ కు వెళ్లి వస్తున్న యువతికి ఓయువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం తరువాత యువతి, యువకుడు ప్రేమించుకుని సినిమాలు, షికార్లు తిరగడం మొదలుపెట్టారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న మూడు వారాలకే ప్రియురాలు ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.
తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలో రమణి అనే యువతి, సంజయ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కోయంబత్తూరులోని మధురాయపురం ప్రాంతంలోనే రమణి, సంజయ్ నివాసం ఉంటున్నారు. 20 ఏళ్ల వయసు ఉన్న రమణి కాలేజ్ కు వెళ్లి బుద్దిగా డిగ్రీ చదువుకుంటున్నది. కాలేజీకి వెళ్లి వస్తున్న రమణికి సంజయ్ పరిచయం అయ్యాడు,

ప్రతిరోజు కాలుజ్ కు వెళ్లి వస్తున్న రమణికి మాయమాటలు చెప్పిన సంజయ్ ప్రేమ పేరుతో ఆమెను వలలో వేసుకున్నాడు. పెళ్లికి ముందే సంజయ్ అతని ప్రియురాలిని అతని బైక్ లో సినిమాలు, షికార్లకు తిప్పడం మొదలుపెట్టాడు. ప్రియుడు సంజయ్ మోజులో పడిపోయిన కాలేజ్ అమ్మాయి రమణి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఆ మ్యాటర్ ఇంటిలో చెప్పింది.
సంజయ్ తో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని రమణికు ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. తల్లిదండ్రుల వ్యతిరేకతను పట్టించుకోకుండా 6వ తేదీన వేలంకన్నిలోని అమ్మన్ ఆలయంలో ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. పోలీసుల రాజీతో రమణి భర్త సంజయ్ ఇంట్లోనే ఉంటోంది.
ఈ సందర్భంలో సంజయ్ తరచూ ఓ కాలేజీ విద్యార్థితో సెల్ ఫోన్ లో మాట్లాడుతుండటం రమణి చూసింది. దీంతో రమణి ఆమె భర్త సంజయ్ ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిన్న సంజయ్ ఎప్పటి లాగే అతని మరో గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతుండటంతో అతని భార్య రమణి అభ్యంతరం వ్యక్తం చేసింి. ఆ సమయంలో సంజయ్ అతని భార్య రమణిపై దాడి చేశాడు.
తరువాత సహనం కోల్పోయిన సంజంయ్ అతని భార్య రమణి ధరించిన చుడీదార్ దుపట్టాతో ఆమె మెడకు బిగించి హత్య చేశాడు. ప్రేమ వివాహం చేసుకున్న కొత్త పెళ్లి కూతురు రమణి అక్కడికక్కడే మృతి చెందింది. హత్యను కప్పిపుచ్చేందుకు సంజయ్ అతని తండ్రి, తల్లి సాయంతో రమణి శవాన్ని బాత్ రూమ్ లో నీళ్లతో కడిగిశారు.

రమణి బట్టలు మార్చుకుంటూ బాత్ రూమ్ లో ఆమె చాన్నీతో గొంతు బిగించుకుందని డ్రామాలు వేశాడు. అసలు విషయం తెలియక ఇరుగుపొరుగు వారు నీళ్లను రమణి నోటిలో పోశారు. అయితే అప్పటికే రమణి ప్రాణం పోయిందని స్థానికులు గమనించలేకపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రమణిని అలంతురై ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, పూలువంబట్టిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అక్కడ రమణి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో, అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రమణి మృతికి సంజయ్, అతని కుటుంబ సభ్యులే కారణమని రమణి తండ్రి కరుపుసామి అలందర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రమణి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సంజయ్, అతని తండ్రి లక్ష్మణన్, తల్లి అమ్ముకుట్టి అలియాస్ పక్రునీషాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం ముగిశాక రమణి గొంతు నులిమి చనిపోయిందని నిర్ధారించారు.
పోలీసుల విచారణలో తన భార్య రమణిని తానే హత్య చేశానని సంజయ్ ఒప్పుకున్నాడు. అనుమానాస్పద మృతిని హత్య కేసుగా మార్చి సంజయ్, అతని తల్లి పక్రునీషా, తండ్రి లక్ష్మణన్‌లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రేమ వివాహం జరిగిన 21 రోజులకే అక్రమ సంబందం కారణంగా రమణిని హత్య చేసిన సంజయ్ తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని నాటకాలు ఆడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications