Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కబ్బడి ప్లేయర్ దారుణ హత్య, శవాన్ని ముక్కలు ముక్కలు చేసి ఇంటి ముందే విసిరేసి !

పంజాబ్/ఛండీగఢ్: పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలో కబడ్డీ (kabaddi)ప్లేయర్‌ ను అతిదారుణంగా హ చేశారు. ఈ ఘటన కొద్ది రోజుల క్రితమే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఆ కబడ్డీ (kabaddi)ప్లేయర్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అతని ఇంటి ముందు పడేయడంతో ఈ ఘటన ఇప్పుడు పెద్ద ఎత్తున కలకలం రేపింది.

ఈ ఘటనను శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. పంజాబ్‌లో (punjab) జంగిల్ రాజ్ పాలనకు అద్దం పడుతోందని ఆరోపించారు. పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, పంజాబ్ (punjab) ముఖ్యమంత్రి భగవత్ మాన్ మీద అకాలీదళ్ నాయకుడు సుఖ్ బీర్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

A kabaddi player was brutally murdered and his body was cut into pieces in punjab
కబ్బడి (kabaddi) ప్లేయర్ హత్యకు సంబంధించి పంజాబ్ (punjab)ముఖ్యమంత్రి భగవత్ మాన్ పరిస్థితిని అదుపు చేయడంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని సుఖ్ బీర్ సింగ్ డిమాండ్ చేశారు. కపుర్తలా జిల్లాలో యువ కబడ్డీ (kabaddi) ఆటగాడు హర్దీప్ సింగ్ దారుణ హత్య గురించి తెలియడం నిజంగా షాకింగ్ సంటన అని అన్నారు.

ఇలాంటి హత్యలు చేయడం ఎంత వరకు సబబు, ఇలాంటి హత్యలు చేసిన నిందితులు ఎవరు అని కనిపెట్టడంతో పంజాబ్ (punjab) ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని సుఖ్ బీర్ సింగ్ ఆరోపించారు. హర్దప్ సింగ్ (kabaddi)మృత దేహాన్ని ముక్కలు ముక్కలు చేయడమే కాకుండా అతని ఇంటి తలుపు తట్టి అతని కుటుంబ సభ్యులకు వార్నింగ్ కూడా ఇచ్చారని, పంజాబ్ ఇప్పుడు పూర్తిగా జంగిల్ రాజ్‌ పాలనగా మారిపోయిందని సుఖ్ బీర్ సింగ్ ఆరోపించారు.

పంజాబ్ లో (punjab) రోజూ హత్యలు, దోపిడీలు, దొంగతనాలు ఇక్కడ సర్వసాధారణమని శిరోమణి అకాలీదళ్ అధినేత ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడంలో పంజాబ్ సీఎం (cm) భగవత్ మాన్ పూర్తిగా విఫలమయ్యారని, అందువల్ల ఎలాంటి జాప్యం లేకుండా మాన్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని సుఖ్ బీర్ సింగ్ డిమాండ్ చేశారు.

స్థానిక నివేదికల ప్రకారం, యువ కబడ్డీ (kabaddi) ఆటగాడిని దారుణంగా చంపిన కేసులో పంజాబ్ (punjab) పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు.నివేదికల ప్రకారం అదే ప్రాంతంలో నివసించే కబడ్డీ ప్లేయర్ హర్దీప్ సింగ్ మరియు హర్‌ప్రీత్ సింగ్ మధ్య కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయని, హర్దీప్ సింగ్, హర్‌ప్రీత్‌లపై గతంలో దిల్వాన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయని వెలుగు చూసింది.

మొత్తం మీద కబ్బడి (kabaddi)ప్లేయర్ ను దారుణంగా హత్య చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరకడం పంజాబ్ లో (punjab) కలకలం రేపింది. కబ్బడి (kabaddi)ప్లేయర్ హర్దీప్ సింగ్ ను పాతకక్షలతో హత్య చేశారా ?, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఇంత దారుణంగా అతన్ని హత్య చెయ్యడానికి కారణాలు ఏమిటి అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+