Viral Video: తాగిన మత్తులో సాంబారు గిన్నెలో పడి వ్యక్తి మృతి.. వైరలైన వీడియో..
చాలా మంది సైలెంట్ గా ఉంటారు. కానీ తాగిన తర్వాత వారి అసలు కథ బయటపడుతుంది. చాలా మంది తాగిన తర్వాత ఏం చేస్తారో వారికే తెలియదు. కొందరైతే బాగా తాగి రోడ్డుపై పడిపోతారు. పక్క నుంచి పెద్ద పెద్ద శబ్దాలతో వాహనాలు వెళ్లిన పట్టించుకోరు. అయితే ఇలా ఒళ్లు తెలియకుంటే తాగితే ప్రాణాలకు ప్రమాదమే.. ముఖ్యంగా తాగిన తర్వాత వాహనాలు నడిపినా, రోడ్డుపై వెళ్తునప్పుడు కూడా జాగ్రత్త వెళ్లాలి. లేకుంటే అంతే సంగతి.

ఊగుతూ..
అయితే ఓ వ్యక్తి జాతరలో బాగా తాగి వేడి వేడి సాంబర్ గిన్నెలో పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళనాడులోని పలంగానట్టిలో గ్రామ దేవత ఉత్సవాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

మరుగుతున్న సాంబార్ లో
ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో భక్తుల కోసం వంటలు చేస్తున్నారు. ఓ పోయి పై అన్నం మరో పోయి పప్పు, అ పక్క పోయిపై సాంబార్ మరిగిస్తున్నారు. అయితే అప్పుడే అక్కడి ఓ వ్యక్తి బాగా తాగి వచ్చాడు. అతడు నడిచే పరిస్థితిలో కూడా లేడు. అతను తూలుతూ గోడ అనుకుని మరుగుతున్న సాంబారు ఒరిగాడు.
ఆస్పత్రికి తరలిస్తుండగా..
దీంతో మసులుతున్న సాంబారులో పడిపోయాడు. అక్కడున్న వారు వెంటనే గమనించి అతన్ని బయటకు తీశారు. కానీ అప్పటికే అతని ఒళ్లు కాలిపోయింది. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో జాతరలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications