కిరాతకం:భార్య తల చేతిలో పట్టుకొని, 8 కిలోమీటర్ల నడిచి, కారణమదేనా?

వివాహేతర సంబంధం పెట్టుకొందని భార్యను హత్య చేశాడు ఓ భర్త. అంతేకాదు భార్య తల పట్టుకొని 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు.ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

భోపాల్: వివాహేతర సంబంధం పెట్టుకొన్న భార్య ను భర్త అతికిరాతకంగా నరికి చంపాడు. ఆమె తలను వేరుచేసి ఐదు కిలోమీటర్ల దూరం ఆమె తలను పట్టుకొని పోలీసుస్టేషన్ కు నడుచుకొంటూ వెళ్ళాడు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకొంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇంగోరియాలోని ఘరేళీ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకొంది. వేరే వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి తన భార్యను పలుమార్లు హెచ్చరించాడు.అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.దీంతో ఆయన ఆమెను హత్య చేశాడు. నారాయణసింగ్ కు, సరితకు కొన్నేళ్ళ క్రితం వివాహమైంది.

a man murdered his wife for illegal affair

అయితే సరిత వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొంది. ఈ విషయమై ఆయన పలుమార్లు హెచ్చరించారు. అయినా మార్పు రాలేదు.

తన వ్యవసాయపొలంలోనే సరిత వేరేవ్యక్తితో అభ్యంతరకరమైన స్థితిలో ఉండడాన్ని నారాయణసింగ్ చూశాడు. వెంటనే ఆయన ఆమెను హత్య చేశాడు. ఆమె తలను వేరుచేశాడు.

ఆమె తలను చేతిలో పట్టుకొని వ్యవసాయ పొలం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాడు. తన భార్యను హత్య చేసిన విషయాన్ని ఆయన పోలీసుల ముందు ఒప్పుకొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+