చదివింది ఆరో క్లాస్, ఆరు మంది లేడీస్ తో ?, దిక్కులేనంత ఆస్తి, విదేశాల్లో ఏం ప్లాన్ చేశాడంటే?
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క పెళ్లి చేసుకుని కుటుంబాన్ని పోషించడమే పెద్ద సాహసం అని చెప్పాలి. భార్య, పిల్లలను చక్కగా, సంతోషంగా చూసుకుంటే చాలురా దేవుడా అనుకునేవాళ్లు కోట్ల మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఒక్కడికి ఇద్దరు భార్యలు, 9 మంది పిల్లలు ఉన్నారు. ఇద్దరు భార్యలతో కాపురం చేస్తున్న పోటుగాడు ఏకంగా ఆరు మంది గర్ల్‌ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇద్దరు భార్యలు, ఆరు మంది గర్ల్స్ ఫ్రెండ్స్ కు ఎలాంటి అనుమానం రాకుండా, ఎవ్వరికి చిక్కకుండా ఇతని వ్యవహారం సాగిపోయింది.
8 మంది మహిళలకు అనుమానం రాకుండా చూసుకున్నాడు. కేటుగాడి వ్యవహారం మహిళ విషయం మాత్రమే కాదు, అతనిపై నకిలీ నోట్ల పంపిణీ, బీమాలో మోసం, చైన్ లింక్ వ్యాపారంలో మోసం సహా అనేక కేసులు ఉన్నాయి. ఇదిలావుండగా, భార్యతో కలిసి విదేశాల్లో న్యూఇయర్ కు ఎంజాయ్ చెయ్యాలని, విదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సిద్ధమైన అతడిని పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ఉత్తరప్రదేశ్‌లోని సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ కేటుగాడు అరెస్టు అయ్యాడు. 41 ఏళ్ల అజిత్ మౌర్య ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కాడు. 6వ తరగతి తర్వాత చదువుకు దూరమైన అజిత్ మౌర్య విద్యావంతులకంటే చాలా తెలివైనవాడు అని వెలుగు చూసింది. పలు వ్యాపారాలు చేస్తున్నట్లు నటిస్తున్న అజిత్ మౌర్య చాలా మందిని మోసం చేస్తున్నాడు. కేవలం ఆరవ తరగతి మాత్రమే చదివిన అజిత్ మౌర్య షార్ట్ వీడియోలో సోషల్ మీడియాలో ఉపన్యాసాలు ఇస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు.
డబ్బు రెట్టింపు వ్యాపారం, చైన్ లింక్ వ్యాపారం, బీమా, నకిలీ నోట్ల మార్పిడితో పాటు పలు వ్యాపారాల్లో పలువురిని మోసం చేసిన అజిత్ మౌర్య కోట్లాది రూపాయలు డబ్బులు సంపాధించాడు. కోట్లాది రూపాయలు డబ్బులు, ఆస్తులు సంపాదించిన అజిత్ మౌర్య కేటుగాడు అని వెలుగు చూసింది. 2000 సంవత్సరంలో సంగీతా అనే మహిళను ముంబాయిలో పెళ్లి చేసుకున్న అజిత్ మౌర్య ఆమెతో కాపురం చేశాడు.
మొదటి భార్య సంగీతాను పెళ్లి చేసుకున్న తరువాత అజిత్ మౌర్య సుడితిరిగింది. 2016లో అజిత్ మౌర్య మీద దొంగతనం కేసు నమోదైంది. మొదటి భార్య సంగీతాకు తెలీకుండా 2019లో సుశీల అనే మరో మహిళను పెళ్లి చేసుకున్న అజిత్ మౌర్య ఆమెతో వేరుగా కాపురం పెట్టాడు. మొదటి భార్య సంగీతాకు 6 మంది పిల్లలు, రెండవ భార్య సుశీలాకు ముగ్గురు పిల్లలు పుట్టారు. 9 మంది పిల్లలకు అజిత్ మౌర్య తండ్రి అయ్యాడు.

ఇద్దరు భార్యలు సంగీతా, సుశీలకు ఒక్కొక్కరిని రూ కోటి రూపాయల విలువ చేసే ఖరీదైన ఇండ్లు రెండు ఇళ్లు కట్టించి ఇచ్చి వారికి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకున్నాడు. ఇద్దరు భార్యలతో జల్సా చేస్తున్న అజిత్ మౌర్య ఏకంగా ఆరు మంది గర్ల్‌ఫ్రెండ్స్‌తో గడుపుతున్నాడు. పలువురిని మోసం చేసి విపరీతంగా డబ్బులు సంపాధిస్తున్న అజిత్ మౌర్య ఎవ్వరికి చిక్కకుండా చాకచక్యంగా అతని తెలివితేటలతో తప్పించుకుంటూ వచ్చాడు.
ఇటీవల ధర్మేంద్ర కుమార్ అనే వ్యక్తికి డబ్బు రెట్టింపు చేస్తామని చెప్పి అతని నుంచి రూ 3 లక్షల రూపాయలు తీసుకున్న అజిత్ మౌర్య అతన్ని మోసం చేశాడు. ఎంతకాలం అయిన డబ్బులు రెట్టింపు కాకపోవడం, తీసుకున్న డబ్బులు వెనక్కి రాకపోవడంతో ధర్మేంద్ర కుమార్ ఫిర్యాదు చెయ్యడంతో అజిత్ మౌర్య మీద కేసు నమోదైంది. దీంతో కేటుగాడు అజిత్ మౌర్యకు అండగా ఉన్న పోలీసులు కేసు తారుమారు చేశారని తెలిసింది.
అయితే కేసు వేరే పోలీసుల చేతికి వెళ్లడంతో అజిత్ మౌర్య పోలీసులకు చిక్కిపోయాడు. అజిత్ మౌర్య మీద ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. అయితే కొందరు పోలీసులను మేనేజ్ చేసుకుంటూ వచ్చిన అజిత్ మౌర్య జైలుకు వెళ్లకుండా జాగ్రత్తపడుతూ వచ్చాడు. అయితే పరిస్థితులు తారుమారు కావడంతో అజిత్ మౌర్య పోలీసులకు చిక్కిపోయాడు.
మొదటి భార్యతో కలిసి విదేశాలకు వెళ్లి అక్కడి హోటల్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్న అజిత్ మౌర్య సర్వం సిద్ధం చేసుకున్నాడు. మొదటి భార్య సంగీతాతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు అన్ని సన్నాహాలు చేసుకున్న అజిత్ మౌర్యన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అజిత్ మౌర్య కలర్ ఫుల్ మోసాల జీవితానికి సంబంధించిన ఒక్కొక్క స్టోరీ బయటకు వస్తున్నాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications