షాక్: భూమిలో అడుగుపెడితే మాడిమసై పోయాడు

మైసూరు నగర శివార్లోని బెలవత్తల గ్రామంలోని భూమిలో అడుగుపెట్టిన హర్షిల్ (14) అనే బాలుడు కాలిపోయి మాడిమసి అయిపోయి మరణించాడు. ఈ భూమి రోజురోజుకు కుతకుత ఉడికిపోతుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురైతున్నారు.

మైసూరు: ఆ భూమిలో కాలుపెడితో క్షణాల్లో మాడిమసి అయిపోతారని వెలుగు చూడటంతో ఆప్రాంతంలో నిషేధాజ్ఞాలు విదించారు. కర్ణాటకలోని రాచనగరి మైసూరు నగర శివార్లలో ఇలాగే ఓ బాలుడు అడుగుపెట్టి మాడి మసి అపోయాడు. మరో బాలుడు దాదాపు కాలిపోయి ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు.

మైసూరు నగరంలోని బెలవత్తల గ్రామం సమీపంలో భూమి కుతకుత ఉడికిపోతుంది, ఆ భూమిలో అడుగుపెట్టిన హర్షిల్ (14) అనే బాలుడు కాలిపోయి మాడిమసి అయిపోయాడు. హర్షిల్ స్నేహితుడు మనోజ్ కు తీవ్రగాయాలై మైసూరు నగరంలోని కేఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆశ్చర్యంతో ఆసక్తిగా వెళ్లి

ఆశ్చర్యంతో ఆసక్తిగా వెళ్లి

మైసూరు నగర శివార్లలోని క్యాతనహళ్లికి చెందిన హర్షిల్ (14) స్నేహితుడు మనోజ్ తదితరులతో కలిసి బెలవత్తగ్రామం సమీపం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ నేల కుతకుతలాడుతున్న విషయం గుర్తించిన హర్షిల్ ఆశ్చర్యపోయి అక్కడ అడుగుపెట్టి చూడాలని ముందుకు వెళ్లాడు.

కుప్పకూలిపోయాడు

కుప్పకూలిపోయాడు

ఆశ్చర్యంతో వెళ్లిన హర్షిల్ భూమిలో చిక్కుకుపోయి బిగ్గరగా ఆరుస్తూ కుప్పకూలిపోయాడు. హర్షిల్ ను రక్షించడానికి ప్రయత్నించిన అతని స్నేహితుడు మనోజ్ భూమిలో చిక్కుకుపోయి తీవ్రగాయాలైనాయి. తీవ్రగాయాలైన ఇద్దరినీ మైసూరులోని కేఆర్ ఆసుపత్రికి తరలించారు.

అదే కారణం

అదే కారణం

చికిత్స విఫలమై హర్షిల్ మరణించాడు. మనోజ్ కు తీవ్రగాయాలైనాయి. మైసూరు నగరంలోని కుంబార కొప్పలు ప్రాంతానికి చెందిన సోమణ్ణకు క్యాతనహళ్లి సమీపంలో నాలుగు ఎకరాల పోలం ఉంది. అందులో ఎలాంటి వ్యవసాయం చెయ్యడం లేదు.

నిప్పు కణికలా

నిప్పు కణికలా

ఆ పోలంలోని భూమి నిప్పు కణికలా మారి కుతకుత ఉడుకుతోంది. ఆభూమిలో కాలుపెడితే భూగర్బంలోకి చేరకతప్పని భయానక వాతావరణం నెలకొంది. ఆ భూమి పరిసర ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు ఉన్నాయి.

రాత్రి పూట చూస్తే అగ్నిగుండం

రాత్రి పూట చూస్తే అగ్నిగుండం

నిత్యం ఆ పరిశ్రమల నుంచి వ్యర్థాలు, రసాయనిక వస్తువులు ఎక్కువగా ఆ భూమిలోకి చేరుతుండటంతో రాత్రి పూట ఆ భూమిని చూస్తే అగ్నిగుండంలా కనిపిస్తోందని, నిప్పు సెగకూడా చాలా దూరం వరకు ఉంటోందని స్థానికులు అంటున్నారు.

ఆరా తీస్తున్న అధికారులు

ఆరా తీస్తున్న అధికారులు

సోమణ్ణకు చెందిన ఆ భూమికి చేరుకున్న గనులు, భూగర్బ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని నిషేదిత ప్రాంతంగా గుర్తించిన మెటగల్లి పోలీసులు అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. సమీపంలోని రసాయనాలు, ఆసుపత్రుల నుంచి వ్యర్థాలు తీసుకు వచ్చి ఇక్కడ వెయ్యడం వలనే భూమి ఇలా తయారైయ్యిందని తహసిల్దార్ రమేష్ బాబు, భూగర్బ శాస్త్రవేత్త ప్రభాకర్ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+