బెడ్ రూమ్ లో ప్రియుడితో రొమాన్స్, కొడుకు ఏడుస్తున్నాడని మేడమ్ ఏం చేసింది?

అహమ్మదాబాద్/సూరత్: మలయాళం సూపర్ హిట్ సినిమాల దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం దృశ్యం భారీ విజయాన్ని అందుకుంది. ఓ హత్యను కథానాయకుడు పోలీసులకు అందకుండా ఎలా మోసం చేస్తాడన్నదే దృశ్యం చిత్రం కథాంశం. ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ వంటి అనేక భాషలలో ఈ సినిమా రీమేక్ చేయబడింది.

ఈ చిత్రం చూసిన తర్వాత ఒక మహిళ హత్య కేసు నుండి తప్పించుకోవడానికి ప్లాన్ చేసింది. అది కూడా తన బిడ్డను చంపి డ్రామాలా చేసింది. గుజరాత్‌లోని సూరత్‌లో నివాసముంటున్న నయనా భవన నిర్మాణ కార్మికురాలు. ఆమెకు 4 సంవత్సరాల క్రితం వివాహమైంది. నయనాకు 2 సంవత్సరాల కుమారుడు వీర్ అనే బాలుడు ఉన్నాడు. నయనా ఆమె భర్తతో తరచూ గొడవ పడుతుండగా అతని క్రూరత్వాన్ని భరించలేక తన బిడ్డతో కలిసి ఆమె తల్లి ఇంట్లో నివసిస్తోంది..

A mother who killed her son after watching movies for her boyfriend who had an illicit relationship in Gujarat

నయనా భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తుండగా జార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ అక్రమ సంబంధానికి నయనా రెండేళ్ల చిన్నారి అడ్డంకి అయ్యాడు. పిల్లాడితో ఉంటే నిన్ను పెళ్లి చేసుకోనని నయనాకు ఆమె ప్రియుడు చెప్పాడు. దీంతో బిడ్డను వదిలించుకోవాలని నయనా నిర్ణయించుకుంది. దృశ్యం సినిమాని చాలాసార్లు చూసిన నయనా కుమారుడిని చంపి ఎలా తప్పించుకోవాలో వ్యూహరచన చేసింది.

ఈ క్రమంలో చిన్నారిని హత్య చేసిన నయనా ఆమె పనిచేస్తున్న నిర్మాణ స్థలంలోని డ్రైనేజీ కాలువలో బిడ్డ శవాన్ని పాతిపెట్టింది. ఆ తర్వాత తన బిడ్డ కనిపించలేదని నయనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదట్లో పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు, అయితే నయనా వాంగ్మూలాలు పరస్పర విరుద్ధంగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత అన్ని సీసీటీవీ ఆధారాలను చూసిన తర్వాత ఈ అనుమానం బలపడింది. అనంతరం పోలీసుల విచారణలో నయనా నిజం ఒప్పుకుంది.

తన బిడ్డను ఖననం చేసిన ప్రదేశాన్ని దృశ్యం సినిమాలో లాగా మారుస్తూ వచ్చింది. ఎట్టకేలకు పోలీసులు నయనాను బెండ్ తియ్యడంతో ఆమె బిడ్డ మృతదేహాన్ని ఆమె కార్యాలయంలోని టాయిలెట్ పిట్‌లో పడేసినట్లు పోలీసులకు తెలిసింది. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ప్రేమికుడి కోసం పుట్టిన బిడ్డను హత్య చేసి దృశ్యం సినిమా చూసి దాని నుంచి తప్పించుకోవాలని ప్లాన్ వేసిన తల్లి నయనా ఇప్పుడు కటకటాలపాలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+