పన్నీర్ సెల్వం రాజీనామా ? ఎక్కడ చూసినా ఇవే ఫ్లెక్సీలు
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేస్తున్నారని, సీఎం పగ్గాలు శశికళకు అప్పగిస్తున్నారని తమిళనాడులో పెద్ద ఎత్తున ఫ్లక్సీలు ఏర్పాటు చెయ్యడంతో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు షాక్ కు గురైనారు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేస్తున్నారని తమిళనాడులో పెద్ద ఎత్తున ఫ్లక్సీలు ఏర్పాటు చెయ్యడంతో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు షాక్ కు గురైనారు. పన్నీర్ సెల్వం ఎందుకు రాజీనామా చేస్తున్నారు ? అంటూ ఇప్పుడు కొత్తగా చర్చ మొదలైయ్యింది.
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నెచ్చలి శశికళను ఏకగ్రీంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్వయంగా శశికళను ఏకగ్రీంగా ఎంపిక చేసిన పత్రాలను పొయెస్ గార్డెన్ కు తీసుకు వెళ్లి ఆమెకు అందించారు.
వామ్మో శశికళ: 'ఆయా నుంచి అన్నాడీఎంకే'చీఫ్ అయ్యారు
అదే సమయంలో అన్నాడీఎంకే చీఫ్ గా ఎంపిక అయిన శశికళకు సీఎం పదవి అప్పగించాలని కొందరు మంత్రులు, శాసన సభ్యులు డిమాండ్ చేశారు. ఆ సమయంలో పన్నీర్ సెల్వం వర్గీయులు ఆందోళనకు గురైనారు.

చివరికి సీఎంగా పన్నీర్ సెల్వం కొనసాగుతారని పార్టీ నాయకులు సర్దిచెప్పారు. ఇదిలా ఉంటే శుక్రవారం అర్దరాత్రి తమిళనాడుతో సహ ఆరాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేస్తున్నారని పెద్ద ఎత్తున ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు.
చూస్తే షాక్: అమ్మ కోసమా, చిన్నమ్మ కోసమా: ఏమి ఏడ్చారండి
ఆ ఫ్లక్సీలలో పన్నీర్ సెల్వం రాజీనామా చేసి సీఎం శశికళ ఉండటానికి ఆయన పూర్తి మద్దతు ఇస్తున్నారని, చిన్నమ్మకు శుభాకాంక్షలు తెలుపుతున్నారని వివరించడంతో ఇప్పుడు ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే సమయంలో ఇలాంటి ఫ్లక్సీలు ఏర్పాటు చెయ్యడంతో అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలలో గందరగోళం నెలకొంది.












Click it and Unblock the Notifications