పాముకాటుకు కొత్త విరుగుడు: సింధటిక్ హ్యూమన్ యాంటీబాడీ; బెంగళూరు శాస్త్రవేత్తల సృష్టి!!
పాము కాటుకు విరుగుడు కనిపెట్టారు బెంగళూరుకు సంబంధించిన శాస్త్రవేత్తలు. పాము కాటు వేసినప్పుడు రక్తంలోకి విడుదలయ్యే విషాన్ని నిర్వీర్యం చేసే మానవ యాంటీ బాడీని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు శాస్త్రవేత్తలు. అమెరికాకు చెందిన స్కిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో కలిసి బెంగళూరు శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది.
కోవిడ్ 19, హెచ్ఐవి వైరస్లను ఎదుర్కొనే యాంటీ బాడీ ల అధ్యయనం ఈ పరిశోధనలకు ప్రాతిపదికగా నిలువగా, సింథటిక్ యాంటీ బాడీని విజయవంతంగా సృష్టించారు బెంగళూరు శాస్త్రవేత్తలు. ఇక బెంగళూరు శాస్త్రవేత్తలు సృష్టించిన ఈ యాంటీ బాడీ కింగ్ కోబ్రా, త్రాచుపాము, కట్లపాము, బ్లాక్ మాంబ వంటి అత్యంత ప్రమాదకరమైన విష సర్పాల విషాన్ని కూడా ఎదుర్కోగలదు అని పరిశోధకులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ చికిత్సకు ఉపయోగించే యాంటీ వీనమ్ గుర్రాలు, కంచర గాడిదలలకు విషాన్ని ఎక్కించి వాటి ద్వారా విరుగుడు మందులు తయారు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ వల్ల అది గుర్రాలకు, కంచర గాడిదలకు ప్రమాదంగా పరిణమిస్తోంది. ఇక తాజాగా బెంగళూరు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన పుణ్యమా అని సింథటిక్ యాంటీ వీనమ్ తయారు చేసేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు.
ఇక బెంగళూరు శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధనా ఫలితాలను సైన్స్ ట్రాన్స్ లేషన్ మెడిసిన్ అనే ఒక జర్నల్ లో ప్రచురించారు. ఈసిఎస్ పిహెచ్డి విద్యార్థులు , పరిశోధక శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రయోగశాలలో పాము విషానికి విరుగుడు మందులు అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.
ఇప్పటివరకు కంచర గాడిదలు, గుర్రాల ద్వారా తయారు చేస్తున్న యాంటీ వీనమ్ స్థానంలో కృత్రిమ మానవ యాంటీ బాడీని సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇది చికిత్స పరంగా అవసరమైన సూక్ష్మజీవులకు యాంటీ బాడీని అందిస్తుందని చెప్పారు. ప్రస్తుతం తాము అభివృద్ధి చేసిన యాంటీ బాడీ పాము విషం లోని త్రీ ఫింగర్ టాక్సిన్ గా పిలవబడే విషాన్ని టార్గెట్ చేస్తుందని, మంచి ఫలితాలను ఇచ్చి ప్రాణాలను కాపాడుతుందని వారు చెప్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications