ఎయిర్ పోర్టులో చెకింగ్, నా బ్యాగ్ లో చెయ్యిపెడితే బాంబు పెలిపోతుంది, ఏం పేలిందంటే ?
ఎయిర్ పోర్టులు నిత్యం రద్దీగా ఉంటాయి. ఇక అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అయితే దేశ విదేశాల నుంచి వచ్చే విమానాలు, ఆ విమానాల్లో వచ్చే ప్రయాణికులతో ఎయిర్ పోర్టులు కిటకిటలాడుతుంటాయి. ఎయిర్ పోర్టులో భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిప్రయాణికుడు, వాళ్లు తీసుకు వెలుతున్న లగేజీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు.
ఎయిర్ పోర్టులకు ఉత్తుత్తి బాంబు బెదిరింపు ఫోన్లు చేస్తున్న నిందితులు అధికారులు గేమ్స్ ఆడుతుంటారు. బాంబు బెదిరింపులు వచ్చిన ప్రతిసారి అధికారులు ఎయిర్ పోర్టు మొత్తం పరిశీలించడం, ఎలాంటి బాంబులు చిక్కపోవడంతో అసహనంతో రగిలిపోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎయిర్ పోర్టులో పని ఒత్తిడితో ఉన్న అధికారులతో గేమ్స్ ఆడాలని ప్రయత్నించిన ఐటీ హబ్ యువకుడికి ఇప్పుడు చుక్కలుకనడ్డాయి.

ఎయిర్ పోర్టులో లగేజ్ చెకింగ్ సందర్భంగా బ్యాగ్ లో బాంబు ఉందంటూ జోక్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సజ్జు కుమార్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సజ్జు కుమార్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సజ్జు కుమార్ పని నిమిత్తం బెంగళూరు విమానాశ్రయం నుంచి కేరళలోని కొచ్చి వెళ్తున్నాడు. ఆ సమయంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని సెక్యూరిటీ సిబ్బంది సజ్జు కుమార్ బ్యాగ్‌ని తనిఖీ చేశారు.

అధికారులు బ్యాగును తనిఖీ చేయగా నా బ్యాగులో బాంబు ఉందని, మీరు చెక్ చేసే సమయంలోనే ఆ బాంబు పేలిపోతుందని నిందితుడు సజ్జు కుమార్ అధికారులను బెదిరించాడని తెలిసింది. బాంబు ఉందంటూ సజ్జు కుమార్ చెప్పడంతో ఒక్క క్షణం షాక్ తిన్న అధికారులు అతని బ్యాగ్ ను. క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే బ్యాగ్‌లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. విమానాశ్రయంలో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు సజ్జు కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు సజ్జు కుమార్ మీద కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications