BMTC: కండక్టర్ రూపాయి ఇవ్వలేదని కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరికి ఏమైందంటే..!
బెంగళూరులో బస్సు కండక్టర్ రూపాయి ఇవ్వలేదని ఓ ప్రయాణికుడు వినియోగదారుల ఫోరంకు వెళ్లారు.
సాధారణంగా మనం బస్సు ఎక్కినప్పుడు రూపాయో, రెండు రూపాయలో కండక్టర్ ఇచ్చేది ఉంటే.. అడిగితే అడుగుతాం.. లేకుంటే బస్సు దిగి వెళ్లిపోతాం. కొందరు అడిగేవారు కూడా ఉంటారు. అలా అడిగే వారికి ఇద్దరు, ముగ్గురు ప్రయాణికులకు కలిపి ఇచ్చి చిల్లర తీసుకోమంటారు. అందుకే చాలా మంది రూపాయో, రెండు రూపాయలో అడకుండా దిగిపోతారు. కానీ ఓ వ్యక్తి రూపాయి కోసం వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్
బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC)కి చెందిన బస్ కండక్టర్ రూ. 1కి చిల్లర ఇవ్వలేదని రమేష్ నాయక్ అనే వ్యక్తి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి విజయం సాధించాడు. ఈ విషయమై విచారించిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ రమేష్ నాయక్ కు రూ. 1 వాపసు ఇవ్వాలని, సేవా లోపానికి రూ. 2,000 పరిహారంతో పాటు రూ. 1,000 చెల్లించాలని కార్పొరేషన్‌ని ఆదేశించింది.

క్రిమినల్ కేసు
తమ ఆదేశాలు పాటించకపోతే, వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 72 ప్రకారం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసే స్వేచ్ఛ ఫిర్యాదుదారుడికి ఉందని స్పష్టం చేసింది. "ఫిర్యాదుదారు ఈ సమస్యను కమీషన్ ముందు తీసుకురావడంపై ప్రశంసిస్తున్నాం. ఈ వివాదం ప్రకృతిలో చిన్నవిషయంగా కనిపిస్తుంది. ఇది వినియోగదారుని హక్కుకు సంబంధించిన అంశంగా గుర్తించాలి"అని కమిషన్ పేర్కొంది.

2019 సెప్టెంబర్ 11న
రమేష్ నాయక్ 2019 సెప్టెంబర్ 11న శాంతినగర్ బస్ స్టేషన్ నుంచి మెజెస్టిక్‌కు బీఎంటీసీ వోల్వో బస్సులో ప్రయాణించాడు. బస్సులోని లేడీ కండక్టర్ రూ.29 టిక్కెట్ ఇచ్చి అతడి నుంచి రూ.30 వసూలు చేసింది. తాను రూ.1 తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయగా కండక్టర్ చెల్లించేందుకు నిరాకరించారని, అసభ్యంగా మాట్లాడారని రమేష్ నాయక్ ఆరోపించారు. రూ. 15,000 నష్టపరిహారం, ఇతర ఉపశమనాలతో పాటు రూ.1 వాపసు ఇవ్వాలని నాయక్ కమిషన్‌ను ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications