అండర్ వేర్ లో కోటి రూపాయల విలువైన బంగారంతో కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన విద్యార్థిని
బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు .బంగారు అక్రమ రవాణా చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు స్మగ్లర్లు. పురుషులు మాత్రమే కాదు విద్యార్థులు ,మహిళలు సైతం విదేశాల నుండి బంగారం అక్రమ రవాణాకు ఎవరికీ దొరకకుండా రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నారు. తాజాగా అండర్ వేర్ లో కోటి విలువైన బంగారాన్ని దాచి తరలిస్తున్న ఓ యువతిని లక్నోలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.ఆ యువతి నుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక విద్యార్థిని ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా దుబాయ్ నుంచి ఇండిగో విమానం లక్నో కి చేరుకుంది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీల లో ఆమె అండర్ వేర్లో కోటి రూపాయల విలువైన 2,318 గ్రాముల బంగారాన్ని అక్రమంగా దాచి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో విద్యార్థినిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు , ఆమె వద్ద లభించిన బంగారాన్ని సీజ్ చేశారు.

తెల్లరంగు పాలిథిన్ కవర్లో బంగారాన్ని దాచి, ఆ కవర్ ను అండర్ వేర్ లో పెట్టుకొని తరలిస్తూ ఒక విద్యార్థిని పట్టుబడడం ఇదే మొదటిసారి. ఇక అరెస్ట్ చేసిన విద్యార్థిని నుండి, బంగారం తీసుకోవడానికి విమానాశ్రయం బయట ఓ వ్యక్తి కూడా వేచి ఉన్నాడని సదరు విద్యార్థిని విచారణ అధికారులకు వెల్లడించింది . ఇక ఇదే విషయాన్ని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ నిహారిక లఖా వెల్లడించారు. కస్టమ్స్ అధికారులకు పట్టుబడకుండా ఈ తరహా చర్యలకు పాల్పడడం నిత్యకృత్యం అయిపోతుందని ఆమె వెల్లడించారు. బంగారం అక్రమ రవాణా చేయాలనుకుంటే కేసుల పాలు అవుతారంటూ హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications