మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఇష్వాక్ ఎదురుకాల్పుల్లో అంతం: భారత్ జవాన్ల ప్రతీకారం !
దేశం మొత్తం వీకెండ్ మూడ్, బక్రీద్ పండగ సంబరాల్లో ఉన్న సందర్బంలో భారత సైనిక బలగాలు ఉగ్రవాదుల మీద గురిపెట్టారు.
శ్రీనగర్: దేశం మొత్తం వీకెండ్ మూడ్, బక్రీద్ పండగ సంబరాల్లో ఉన్న సందర్బంలో భారత సైనిక బలగాలు ఉగ్రవాదుల మీద గురిపెట్టారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది కోసం గాలింపు ముమ్మరం చేసిన భారత భద్రతా దళాలు ఎన్ కౌంటర్ లో అతన్ని అంతం చేశారు.
మచివా ఇష్వాక్ పద్దార్ శనివారం ఎన్ కౌంటర్ లో అంతం అయ్యాడు. ఇష్వాక్ పద్దార్ కోసం భారత బలగాలు చాల కాలంగా గాలిస్తున్నారు. శనివారం జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని తంత్రిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని భారత భద్రతా దళాలకు సమాచారం అందింది.

వెంటనే ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాలకు వెళ్లిన సమయంలో భారత భద్రతా దళాల మీద కాల్పులు జరిపారు. ఆ సందర్బంలో భారత భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపడంతో ఇష్వాక్ పద్దార్ అంతం అయ్యాడు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నాయని సమాచారం.
లెఫ్టినెంట్ కల్నల్ ఉమర్ ఫయాజ్ ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన కేసులో ఉగ్రవాది ఇష్వాక్ పద్దార్ ప్రధాన నిందితుడు అని అధికారులు అంటున్నారు. శుక్రవారం పాకిస్థాన్ సైనికులు పూంచ్ సెక్టార్ లో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటంతో బీఎస్ఎఫ్ జవాను వీరమరణం పొందాడు.












Click it and Unblock the Notifications