వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: చీపురు పట్టిన ప్రియాంక గాంధీ: నిరాహార దీక్ష కోసం సన్నద్ధం

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు.. ఆ రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా సంవత్సర కాలంగా ఆందోళనలు చేస్తూ వస్తోన్న రైతులు.. లఖింపూర్ ఖేరి ఉదంతం అనంతరం తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ దిశగా భారతీయ కిసాన్ యూనియన్ ఇప్పటికే కార్యాచరణలోకి దిగింది కూడా.

ఆందోళనకు పిలుపు


వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- ఈ అవాంఛనీయ సంఘటనలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అటు ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ఉత్తర ప్రదేశ్‌ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలకు పిలుపునిచ్చాయి. భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధులు ఈ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు అండగా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రాజకీయ వేడి

లఖింపూర్ ఖేరిలో మృత్యువాత పడిన ఎనిమిది మంది రైతుల కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా.. సమాజ్ వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రెండు సంఘటనలు కూడా అక్కడి రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టేశాయి.

సీతాపూర్‌కు తరలింపు..

కాగా- ప్రియాంకా గాంధీ వాద్రాను పోలీసులు హర్గావ్‌లో అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారు జామున 5:30 గంటలకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హర్గావ్ నుంచి సీతాపూర్‌కు తరలించారు. సీతాపూర్‌లోని ప్రావిన్షియల్ ఆర్మ్స్ కాన్‌స్టాబిలరీ గెస్ట్ హౌస్‌లో ఆమెను నిర్బంధించారు. ఈ ఉదయం నుంచీ ప్రియాంక గాంధీ వాద్రా అక్కడే ఉంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పలువు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు.

దుమ్ము, ధూళితో నిండిన గదిలో..

పీఏసీ గెస్ట్ హౌస్‌లో తనను నిర్బంధించిన గది దుమ్ము, ధూళితో నిండి ఉండటంతో ప్రియాంకా గాంధీ స్వయంగా దాన్ని శుభ్రం చేశారు. చీపురు పట్టి గదిని ఊడ్చారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే గదిలో ప్రియాంక గాంధీ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారని ఉత్తర ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు వెల్లడించారు. లఖింపూర్ ఖేరి సందర్శనకు వెళ్లడానికి అనుమతి ఇచ్చేంత వరకూ దీక్ష కొనసాగిస్తారని అన్నారు.

దురుసుగా ప్రవర్తించిన పోలీసులు..


హర్గావ్‌లో ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారని యూపీ పీసీసీ నాయకులు ఆరోపిస్తోన్నారు. తమ నాయకురాలిని చేయి చేసుకున్నారని విమర్శిస్తున్నారు. శాంతియుతంగ తాము లఖింపూర్ ఖేరిని సందర్శించడానికి వెళ్లగా అడ్డుకోవడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించే అవకాశం కూడా ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు.

ఒక్కరైనా పరామర్శించారా?


లఖింపూర్‌ ఖేరిలో ఎనిమిది మరణానికి కారణమైన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశీష్ కుమార్ మిశ్రాలను వెంటనే అరెస్ట్ చేయాలని, వారిని పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తోన్నారు. ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ నాయకులు గానీ, ప్రభుత్వం తరఫున అధికారులు గానీ బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం సిగ్గుచేటు అంటూ కాంగ్రెస్ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు.

English summary
A video of Congress General Secretary Priyanka Gandhi Vadra sweeping a room with a broom has gone viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X