బాయ్ ఫ్రెండ్ బాధపడుతున్నాడని భర్త గొంతు కోసేసిన భార్య, కూతుర్లు !

చెన్నై/పుదుచ్చేరి: యువతి, యువకుడు ప్రేమించుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దంపతులకు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మధ్య తేడాలు వచ్చాయి. పిల్లలను పిలుచుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఇంటికి పిలుచుకుని రావాలని భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. భార్య మాత్రం నేను నీ ఇంటికి రాను అని తేల్చి చెప్పింది. తరువాత భర్తను అతని ఇంటిలో గొంతు కోసి అతి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. భార్యతో పాటు మరో వ్యక్తి అరెస్టు కావడంతో కథ మలుపు తిరిగింది.

పుదుచ్చేరిలోని మెట్టుపాళ్యంలోని హాస్పిటల్ రోడ్డులో సుబ్రమణి (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.10 సంవత్సరాల క్రిం రంజిత అనే యువతిని సుబ్రమణి ప్రేమించాడు. తరువాత సుబ్రమణి, రంజిత ప్రేమించుకుని 8 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సుబ్రమణి, రంజిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

r husband

సుబ్రమణి మేస్త్రీ పని చేస్తూ భార్య రంజితతో పాటు కుమార్తెలను పోషిస్తున్నాడు. రెండు సంవత్సరాల నుంచి భర్త సుబ్రమణితో గొడవలు పడుతున్న రంజిత చీటికిమాటికి పుట్టింటికి వెళ్లిపోతున్నది. కొన్ని రోజుల క్రితం సుబ్రమణి, రంజిత దంపతల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో భర్త సుబ్రమణితో గొడవపడిన రంజిత ఇద్దరు కుమార్తెను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

నాలుగు రోజులు క్రితం సుబ్రమణి అతని భార్య రంజిత ఇంటికి వెళ్లి మన ఇంటికి రావాలని అతని భార్యను వేడుకున్నాడు. అయితే భర్త సుబ్రమణి ఇంటికి వెళ్లడానికి అతని భార్య రంజిత నిరాకరించింది. భార్య రంజితను ఇంటికి పిలుచుకుని వెళ్లాలని అనేక ప్రయత్నాలు చేసిన సుబ్రమణి చివరికి అతని ఇంటికి వెళ్లిపోయాడు.

తరువాత తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన సుబ్రమణి బోరున విలపించాడు. తన భార్య రంజితకు అక్రమ సంబంధం ఉందని, తన మాట వినడటం లేదని సుబ్రమణి అతని తల్లి నాగమ్మ దగ్గర విలపించాడు. తరువాత సుబ్రమణి అక్కడికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం బంధువు వెళ్లి చూడగా సుబ్రమణిని గొంతు కోసి దారుణంగా హత్య చేసిన విషయం గుర్తించిన బంధువు వెంటనే అతని తల్లి నాగమ్మకు ఫోన్ చేసి చెప్పాడు.

నాగమ్మ కేకలు వేస్తూ బోరున విలపించి కొడుకు సుబ్రమణి ఇంటికి వెళ్లింది. అప్పటికే సుబ్రమణి రక్తపుమడుగులో శవమై కనిపించాడు. తరువాత నాగమ్మ తన కొడుకును హత్య చేశారని, తన కోడలు రంజిత మీద అనుమానం ఉందని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సుబ్రమణి హత్య కేసులో అతని భార్య రంజితను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

ఆ సమయంలో షాకింగ్ సమాచారం బయటకు వచ్చింది. రంజితకు ఆమె బంధువు మరియప్పన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అందుకే ప్రతినిత్యం భర్త సుబ్రమణితో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయి ప్రియుడు మరియప్పన్ తో జల్సా చేస్తోందని పోలీసు అధికారులు తెలిపారు. రంజిత పుట్టింటికి వెళ్లిన సుబ్రమణి మన ఇంటికి రావాలని ఆమెను వేడుకున్నాడని పోలీసులు అన్నారు.

ఆ సందర్బంలో మరియప్పన్ వెళ్లి నీ భార్య రంజిత నీతో రాదని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సుబ్రమణియన్ ను హెచ్చరించాడని, తరువాత సుబ్రమణి అతని భార్య రంజితను చితకబాదేశాడని పోలీసులు అన్నారు. అక్రమ సంబంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని అనుకున్న రంజిత తరువాత ప్రియుడు మరియప్పన్ తో కలిసి సుబ్రమణియన్ గొంతు కొసి చంపేశారని నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. సుబ్రమణి హత్య కేసులో అతని భార్య రంజితతో పాటు ఆమె ప్రియుడు మరియప్పన్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+